మేం ఏ బ‌ట్ట‌ల వేసుకుంటే మీకెందుకు మీరెమైనా డ‌బ్బులిస్తున్నారా..? నెటిజ‌న్ల‌కు సురేఖా వాణి కూతురు కౌంట‌ర్

First Published | Jul 1, 2022, 5:47 AM IST

నెటిజన్లకు బుర్ర తిరిగే సమాధానం ఇచ్చింది నటి సురేఖావాణి కూతురు సుప్రీత. తమపై వస్తున్న రకరకాల కామెంట్లు, ట్రోల్స్ కు గట్టిగా బదులు చెప్పింది. ఇంతకీ సుప్రీత ఏ విషయంలో హర్ట్ అయ్యింది. ఏం కౌంటర్ ఇచ్చింది.

మా బట్టలు మా ఇష్టం .. మీ డబ్బులతో మీరు ఏమైనా కొని ఇస్తున్నారా..? లేక మీ నుంచి మేమేమన్నా ఆశిస్తున్నామా..? అడుగుతున్నామా..? మీ పని మీరు చూసుకోక.. మా గురించి మీకెందుకు అంటూ... నెటిజన్లపై విరుచుకుపడింది సురేఖావాణి కూతురు సుప్రీత. తన తల్లితో పాటు తన డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడిన వారి నోరు మూయించింది. ఇంతకీ ఆమెకంత కోపం ఎందుకు వచ్చింది.  
 

టాలీవుడ్ లో   గ్లామర్ ఉన్న అతికొద్దిమంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లలో సురేఖ వాణి కూడా ఒక‌రు. హీరో హీరోయిన్ ల‌కు అక్క వ‌దిన క్యారెక్ట‌ర్ లు చేస్తున్నా.. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందం సురేఖ వాణిది. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా  ఇండ‌స్ట్రీలో బిజీ బిజీగా సురేఖావాణి  ఎమోష‌న‌ల్ సీన్ లు కామెడీ సీన్ల‌లో సైతం న‌టిస్తూ న‌టిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 
 


మంచి మంచి పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సురేఖా..ఎంతో మంది అభిమానులను కూడా సంపాధించుకన్నారు. అంతే కాదు ఇండస్ట్రీ వ్యక్తినే పెళ్ళాడిన  సురేఖవాణికి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆయ‌న కొంత‌కాలం క్రితం అనారోగ్యం భారిన ప‌డి మ‌ర‌ణించారు.వీరికి ఒక కూతురు కూడా ఉంది ఆమె సుప్రీత.
 

ఇక సురేఖ‌వాణికి కూతురు సుప్రీత సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ  సోషల్ మీడియా ద్వారా సెల‌బ్రెటీ స్టేట‌స్ నుచాలా త్వరగా సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం సుప్రీత హీరోయిన్ గా కూడా ఓ సినిమా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే విధంగా యాడ్ షూట్స్ కూడా చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ తల్లీ కూతురు వీడియోలకు మస్త్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. 
 

సురేఖ వాణి సుప్రీత లు చూడ్డానికి త‌ల్లి కూతుళ్ల‌లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటారు. వయస్సులో కూడా డిఫరెన్స్ కనిపించదు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో వీర‌ద్ద‌రూ వీడియోల‌కు స్టెప్పులు వేస్తుంటారు. అంతే కాదు.. విదేశాలకు వెళ్ళి మరీ ఎంజాయ్ చేయడం.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడం వీరికి కామన్ గా మారింది.  గోవా బ్యాంకాక్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారుఈ సెలబ్రిటీ తల్లీకూతుర్లు.

అయితే ఈ విషయంలో చాలా సార్లు ట్రోల్స్ కు గురయ్యారు వీరు. కొంత‌మంది నెటిజ‌న్లు వీరిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. భ‌ర్త చ‌నిపోయిన బాధ కూడా సురేఖ‌వాణికి లేద‌ని ఎంజాయ్ చేస్తుంద‌ంటూ.. రకరకాలు గా విమర్షలు గుప్పించారు. అంతే కాకుండా త‌ల్లికూతుళ్ల డ్రెస్ సెన్స్ పై కూడా ఎన్నో నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఇక వాటన్నింటికీ.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సుప్రీత ఘాటుగా స‌మాధానం ఇచ్చారు.

మేం ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకుంటే మీకెందుకు..మీరేమైనా డ‌బ్బులు ఇస్తున్నారా అంటూ ప్ర‌శ్నించారు. మా నాన్న చ‌నిపోయిన‌ప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎవ‌రైనా చూశారా. మా అమ్మ క‌నీసం బ‌య‌ట‌కు కూడా రాలేద‌ని మండిపడింది. అంతే కాకుండా త‌న త‌ల్లిని దూరంగా తీసుకెళ్లేందుకే బ్యాంకాక్ కు తీసుకువెళ్లిన‌ట్టు తెలిపింది. కానీ అలా వెళ్లినా కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 

అంతే కాదు త‌న తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు ఆయ‌న త‌రుపున వాళ్లు ఎవ‌రూ రాలేద‌ని త‌న త‌ల్లి కుటుంబం వారే అన్నీ చూసుకున్నార‌ని అవేద‌న వ్య‌క్తం చేసింది. నాన్న చనిపోయాడన్న బాధ నుంచి అమ్మను బయటకు తీసుకువచ్చి.. మామూలుగా చేస్తుంటే.. రకరకాల కామెంట్స్ వినాల్సి వస్తుందంటూ.. మండిపడింది. ఈరోజు కామెంట్స్ చేసేవారు.. ఎప్పుడూ తమకు కష్టాల్లో సాయం రారు అంటూఘాటుగా సమాధానం చెప్పింది సుప్రీత. 

Latest Videos

click me!