‘కేజీఎఫ్’ హీరోయిన్, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) సినిమాల పరంగా పెద్దగా సందడి లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది.
ప్రశాంత్ నీల్ - యష్ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్ 1, 2’ చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ కు సరికొత్త రికార్డులు వచ్చాయి. దాంతో పాటు శ్రీనిధికి కూడా మంచి గుర్తింపు దక్కింది.
మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ తొలిసినిమాతోనే పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్కసారిగా తారా స్థాయికి చేరుకుంది. ఇండస్ట్రీలో ఓ వెలుగొందుతుందని అందరూ భావించారు.
కానీ, శ్రీనిధి విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. కేజీఎఫ్ తర్వాత కేవలం విక్రమ్ సరసన ‘కోబ్రా’లో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఆఫర్లు పెద్దగా రాలేదు. ఉవ్వెత్తున వచ్చిన క్రేజ్ ను వినియోగించుకోలేకపోయింది.
కేజీఎఫ్ చాఫ్టర్ 2 తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. ఈ బ్యూటీకి ఏ సినిమా అవకాశం లేకపోవడం ఆశ్చర్యంగా మారింది. మళ్లీ ఎప్పుడూ వెండితెరపై సందడి చేస్తుందని ఎదురుచూశారు.
సినిమాల పరంగా పెద్దగా సందడి చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం శ్రీనిధి నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది.
గ్లామర్ షోకు చాలా దూరంగా ఉండే శ్రీనిధి శెట్టి.. సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా లెహంగా వోణీలో మెరుపులు మెరిపించింది. బ్యూటీఫుల్ లుక్ లో కట్టిపడేసింది.
అందాల విందుకు ప్రాధాన్యత ఇవ్వని ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ మెరిసినా మత్తెక్కించే ఫోజులతో మంత్రముగ్ధులను చేస్తోంది. గుచ్చే చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. ఇదిలా ఉంటే.. శ్రీనిధికి బాలయ్య - బాబీ చిత్రంలో అవకాశం దక్కిందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.