నేను ఎంజాయ్ చేస్తా నీకేంట్రా నొప్పి, పిల్లల్ని చూసుకుంటూ బ్రతకాలా... మంచు లక్ష్మి సంచలన వీడియో!

నా జీవితం నా ఇష్టం అంటూ ఫైర్ అయ్యింది మంచు లక్ష్మి. ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. 
 

manchu lakshmi sensational video on haters goes viral ksr
Manchu Lakshmi

మంచు లక్ష్మి ట్విట్టర్ వీడియో వైరల్ అవుతుంది. తన గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లకు ఆమె క్లాస్ పీకారు. విషయంలోకి వెళితే... ఎయిర్ పోర్ట్ లో కార్పెట్స్ శుభ్రంగా లేవు. బిజినెస్ క్లాస్ కి వెళ్లే కార్పెట్స్ ఇంత దారుణమా. నా ఐ ఫోన్ ఆ కార్పెంట్స్ ని కొంచెం బెటర్ గా చూపించాయి. చెప్పాలంటే అవి ఇంకా అపరిశుభ్రంగా ఉన్నాయి. శుభ్రత మన హక్కు... అని వీడియో పోస్ట్ చేసింది. 

manchu lakshmi sensational video on haters goes viral ksr
Manchu Lakshmi

అంటే నువ్వు బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నావ్, ఐఫోన్ వాడుతున్నావ్ అని మాకు తెలియాలా? అతి చేయకు. నీకు డబ్బులు ఉన్నాయి. ఎలాగైనా ఎంజాయ్ చేస్తావ్... అంటూ నెగిటివ్ కామెంట్స్ వెల్లువెత్తాయి. నెటిజెన్స్ రియాక్షన్ కి హర్ట్ అయిన మంచు లక్ష్మి వీడియో పోస్ట్ చేసింది. 
 


Manchu Lakshmi

నేను బిజినెస్ క్లాస్ లో తిరుగుతాను, ఐఫోన్ వాడతాను. ఎవడ్రా నువ్వు నన్ను అడగడానికి. నువ్వేమైనా నాకు డబ్బులు ఇస్తున్నావా? నేను కష్టపడి సంపాదించుకుంటున్న డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నా. మీకు ఉండవా కోరికలు. నాకు ప్రైవేట్ జెట్ ఉంటే బాగుండు అనుకుంటా... మీరు కోరుకోరా?
 

నాకు డబ్బులు అమ్మానాన్న ఎవరూ ఇవ్వడం లేదు. చిన్నప్పటి నుండి అలానే పెంచారు. నేను ఎంజాయ్ చేసే ప్రతి రూపాయి నాదే. నేను ధనిక కుటుంబంలో పుట్టాను. అలాంటి నేను అమెరికాలో తిండికి కూడా ఇబ్బందిపడ్డాను. డబ్బు సంతోషం ఇవ్వదు. కేవలం ఫ్రీడమ్ ఇస్తుంది. 

నేను కూడా ఇల్లు, పిల్లల్ని చూసుకుంటూ, గిన్నెలు తోముకుంటూ బ్రతకాలా?. ఆడవాళ్లు ఏం చేసినా తప్పేనా? మాకంటూ కెరీర్ ఉండకూడదా?. ఆడవాళ్లు ఈ పనులు చేయడం తప్పు కాదు. ఎవరి కెరీర్లో వాళ్ళు ఎదుగితే తప్పేంటి. జీవితం చాలా చిన్నది. చిటికెలో ముగుస్తుంది. ఒకరి కోసం బ్రతకకు. నీకు ఇష్టం వచ్చినట్లు జీవించు... అంటూ వీడియో షేర్ చేసింది. 

ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లుక్ ఆకట్టుకుంది. అగ్ని నక్షత్రం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. 

అలాగే మరికొన్ని చిత్రాలు చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. ఇటీవల మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ వివాహం దగ్గరుండి చేసింది. మోహన్ బాబు, మంచు విష్ణుకు ఇష్టం లేకపోయినా మనోజ్-మౌనికల వివాహం చేసిందంటూ ప్రచారం జరిగింది. 

Latest Videos

vuukle one pixel image
click me!