కింగ్ నాగార్జున ను భయపెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

First Published | Sep 11, 2024, 7:45 PM IST

టాలీవుడ్ ను ఏలిని నలుగురు హీరోలలో నాగార్జున ఒకరు. నటనపరంగా కాని, బిజినెస్ పరంగా కాని.. ఆయన భయపడి వెనకడుకు వేసింది లేదు. కాని ఒక హీరోయిన్ మాత్రం నాగార్జునను బాగా భయపెట్టిందట. ఇంతకీ ఎవరావిడ. 
 

అక్కినేని నాగార్జున.. నాగేశ్వరావు లెగసీని కాపాడుతూ.. స్టార్ హీరోగా మారాడు. నాగేశ్వరావుబిజినెస్ లకు  కూడా రెట్టింపు చేశారు నాగ్. వరుస సినిమాలతో స్టార్ హీరో స్టేటస్ ను సాధిచిన ఈ హీరో ఎంతో మంది హీరోయిన్లతో ఆడిపాడాడు. 

చాలామంది హీరోయిన్లను పరిశ్రమకు పరిచయం చేశారు నాగార్జున. అంతే కాదు.. బాలీవుడ్ తారలతో హిట్ సినిమాలు చేసినహీరోలలో నాగార్జుననే ముందు ఉన్నారు. లేడీ ఫాలోయింగ్ ఎక్కుగా ఉన్న కింగ్ కు.. టాలీవుడ్ మన్మధుడు అన్నపేరు కూడా ఉంది. అప్పట్లో నాగార్జున కు చాలా మంది హీరోయిన్లతో అఫైర్ రూమర్స్ గట్టిగా నడిచాయి.  

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

అక్కినేని వారసుడిగా.. నాగేశ్వ‌ర‌రావు తనయుడిగా తెలుగు  ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్ .. తన సొంత ఇమేజ్ తో ఎదిగారు. స్వ‌యంకృషితో  నాగార్జున స్టార్ హీరో స్థాయిని అందుకున్నారు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిన‌ని నిరూపించుకున్నారు.

న‌టుడిగా కాకుండా నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా సైతం స‌త్తా చాటుతున్న నాగార్జున‌.. మాస్, క్లాస్, డివోషినల్, యాక్షన్ ఇలా అన్ని జానర్లు కలుపుకుని.. నాగార్జున  మొత్తం ఫిల్మ్ కెరీర్ లో 90కి పైగా సినిమాలు చేశారు.

ఈక్రమంలో ఎంతో మంది హీరోయిన్లను చూశారు. హీరోయిన్లతో కాస్త రొమాంటిక్ గా ఉండే నాగార్జున ఓ హీరోయిన్ నుచూసి మాత్రం కాస్త భయపడ్డారట. ఆమెతో నటించడానికి జాగ్రత్త పడ్డారట కూడా. ఇంతకీ ఎవరామె. 

అల్లు అర్జున్ పై మలయాళ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్,


 ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు.. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి. అవును సౌత్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా స్టార్ డమ్ సాధించిన ఈ హీరోయిన్ తో నటించడానికి నాగార్జున భయపడ్డారట. తన తండ్రి నాగేశ్వరావుతో శ్రీదేవి చాలా సినిమాలు చేసింది.  

అటు తండ్రి, ఇటు కొడుకు.. ఇద్ద‌రితోనూ రొమాన్స్ చేసిన అతి కొద్ది మంది హీరోయిన్ల‌లో శ్రీ‌దేవి ఒక‌రు. ఏఎన్ఆర్ జంటగా చాలా సినిమాల్లో ఆడిపాడిన శ్రీదేవి నాగార్జున కంటే ఫిల్మ్ ఇడస్ట్రీలో చాలా సీనియర్.

వయసు రిత్యా చిన్నదే అయినా.. నటన పరంగా ఆమె సీనియర్. అందులోను తనతండ్రితో కలిసి నటించింది. దాంతో నాగార్జునకు ఎక్కడో కాస్త భయం వేసిందని టాలీవుడ్ టాక్. 

బిగ్ బాస్ 18 కోసం సల్మాన్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

ఇక  నాగార్జున‌, శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన ఫస్ట్ మూవీ ఆఖ‌రి పోరాటం. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఓ అద్భుతమైన  నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకేంద్రుడు  కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో  వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీద‌త్‌ ఈ సినిమాను నిర్మించారు.

1988 మార్చి 12 విడుదలైన ఆఖరి పోరాటం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. అయితే ఆఖరి పోరాటం సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవితో కలిసి నటించడానికి మొదట్లో నాగార్జున భయపడ్డారట.  

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభ‌న్ బాబు వంటి అగ్ర హీరోలతో శ్రీదేవి సినిమాలు చేశారు. అటువంటి శ్రీదేవి పక్కన తాను నటించగలనా అని నాగార్జున భ‌య‌ప‌డేవార‌ట‌

పాకిస్తాన్‌ లో పుట్టిన 5 బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

Nagarjuna sridevi

కానీ రోజుల గడుస్తున్న కొద్ది నాగార్జునలో భయం పోయింది. శ్రీదేవితో కలిసి యాక్ట్ చేయడం ఆయన ఛాలెంజ్ గా తీసుకున్నారు .ఆమెతో కలిసి పోటా పోటీగా నటించేవారు. ఇక ఆఖరి పోరాటం తర్వాత నాగార్జున-శ్రీదేవి కాంబినేషన్ లో రామ్ గోపాల్ వ‌ర్మ గోవిందా గోవిందా సినిమాను తీశారు.

కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మరోవైపు బాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో శ్రీదేవి-నాగార్జున జంటగా నటించారు. అన్నింటిలోనూ ఆఖరి పోరాటం మంచి సినిమాగా నిలిచిపోయింది. 

Latest Videos

click me!