అది అద్భుతమైన ఫీలింగ్.. రిప్లై ఎందుకివ్వాలి.. డేటింగ్ రూమర్లపై శోభితా ధూళిపాళ కామెంట్స్

First Published | May 8, 2023, 3:56 PM IST

యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ ( గురించి కొద్దిరోజులుగా డేటింగ్ రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వాటిపై శోభితా స్పందించారు.  
 

కుర్రభామ శోభితా దూళిపాళకు రీసెంట్ గా ‘పొన్నియిన్ సెల్వన్’తో అలరించిన విషయం తెలిసిందే. తెలుగు బ్యూటీ అయినప్పటికీ తన కేరీర్ ను మాత్రం బాలీవుడ్ లోనే మొదలు పెట్టింది. ‘రామన్ రాఘవ్ 2.0’తో వెండితెరకు పరిచయం అయ్యింది. 
 

ఆ తర్వాత వరుసగా హిందీలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగు ప్రేక్షకులను ‘గూఢచారి’తో ప్రలకరించింది. అప్పటి నుంచి సౌత్ సినిమాలపైనా ఫొకస్ పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ శోభితా యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తన గురించి అభిమానులకు తెలియజేస్తున్నారు. 
 


ఈ క్రమంలో శోభితా తనపై కొద్దిరోజులుగా వస్తున్న డేటింగ్ రూమర్లపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘నాపై రూమర్స్ ఎక్కువగా రాలేదనే అనుకుంటున్నా. ఎవరో ఒకరు తెలిసీ తెలియక మాట్లాడిన వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన  పని లేదు. నా తప్పులేకుండా వచ్చిన వార్తలకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. 

నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వంలోని ‘పొన్నియిన్ సెల్వన్’లో నటించాను. పైగా నాలుగు పాటలకు ఏఆర్ రెహమాన్ సంగీతానికి డాన్స్ చేయడం అద్భుతమైన  ఫీలింగ్ ని ఇచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా  జీవితంతో ముందుకు సాగాల్సిందే. అనవసరమైన వాటిపై ఆలోచించాల్సిన పన్లేదు.’ అంటూ చెప్పుకొచ్చింది.
 

కొద్దిరోజులుగా నాగచైతన్య - శోభితా ధూళిపాళ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే.  పైగా లండన్ లో వీరిద్దరూ షికారు చేసిన ఫొటోలను, అంతకు ముందు ఎఫ్1 రేస్ లో సందర్భంగా కలిసి దిగిన  పిక్స్ కూడా వైరల్ గా మారాయి. ఈ రీసెంట్ గా పాల్గొన్న కార్యక్రమంలో శోభితా వాటిపై పరోక్షంగా  సమాధానం ఇచ్చారు. 
 

అటు నాగచైతన్య కూడా డేటింగ్ రూమర్లను ఖండించిన  విషయం తెలిసిందే. కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ‘జనాలు రూమర్లనే నమ్మడం బాధాకరమన్నారు.’ ప్రస్తుతం ‘సితారా’, ‘మంకీ మ్యాన్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  

Latest Videos

click me!