టర్కీలో సమంత.. అదిరిపోయే అవుట్ ఫిట్లలో సామ్ స్టన్నింగ్ లుక్.. పిక్స్

First Published | Jun 5, 2023, 6:38 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం టర్కీ ట్రిప్ లో ఉంది. ఈ సందర్భంగా కొన్ని బ్యూటీఫుల్ ఫోటోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో సామ్ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది.
 

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పదమూడేళ్లకు పైగా సామ్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. సౌత్ స్టార్ హీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే నటిగా చాలా క్రేజ్ ను సంపాదించుకుంది. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి జంటగా ‘ఖుషి’తో సందడి చేయబోతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 
 


రీసెంట్ గా ఈ చిత్రం ఇస్తాంబుల్ లో షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దాంతో అటు నుంచి సమంత చిన్న ట్రిప్ ను ప్లాన్ చేసుకుంది. ప్రస్తుతం టర్కీ లో ఉంది. విదేశాల్లో రిలాక్స్ అవుతూ ఉంది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను పంచుకుంది. 
 

ఓ హోటల్ లో రిలాక్స్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ ఫొటోలకు ఫోజులిచ్చింది. తన గదిలోని పీస్ ఫుల్ వాతావరణానికి సంబంధించిన ఫొటోలను పంచుకుంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

బ్లాక్ అవుట్ ఫిట్ లో సమంత ట్రెండీగా మెరిసింది. అద్దం ముందు అదిరిపోయే స్టిల్ తో అట్రాక్ట్ చేసింది. అలాగే క్యాజువల్ వేర్ లోనూ మిర్రర్ ముందు చిలిపి ఫోజుతో ఆకట్టుకుంది. మరోవైపు బాత్ టవల్ ను చుట్టుకొని క్యూట్ గా ఫొటోకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

చివరిగా సమంత ‘శాకుంతలం’తో అలరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘ఖుషి‘తో పాటు ‘సిటడెల్’ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1న Kushi  వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ‘సిటడెల్’ శరవేగంగా జరుగుతోంది. 
 

Latest Videos

click me!