ఇక, రీసెంట్ గా తమిళ్ లో కాతు వాకుల రెండు కాదల్ సినిమాలో కనిపించింది సమంత. ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కలసి ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో నటిస్తోంది. ఇప్పటికే తను నటిస్తున్న భారీ చిత్రాలు ‘శాకుంతలం, యశోద’ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాయి. సైఫై మూవీ ‘యశోద’ను ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు.