బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘ఏజెంట్’ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ సినిమాలో సాక్షి వైద్య?

Published : Jun 22, 2023, 07:46 PM ISTUpdated : Jun 22, 2023, 07:48 PM IST

యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య (Sakshi Vaidya)కు బంపర్ ఆఫర్ తాకింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో ఈ బ్యూటీకి నటించే ఛాన్స్  దక్కినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో శ్రీలీలా నటిస్తున్న విషయం తెలిసిందే.   

PREV
16
బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘ఏజెంట్’ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ సినిమాలో సాక్షి వైద్య?

ముంబై బ్యూటీ సాక్షి వైద్య  రీసెంట్ గా ‘ఏజెంట్’ చిత్రంలో అలరించిన విషయం తెలిసిందే. మోడల్ గా కేరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ సరసన నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేపోయింది.
 

26

అయినా, సాక్షి వైద్యకు టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సాక్షి వైద్య పేరు ఆయా చిత్రాల్లో వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ సినిమాకు ఈ బ్యూటీ హీరోయిన్ అని తెలుస్తోంది. తేజూ - డెబ్యూ డైరెక్టర్ జయంత్ కాంబోలో సినిమా రూపుదిద్దుకోనుంది. 
 

36

ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. సాక్షి బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ బ్యూటీ కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశిస్తున్నారు. 
 

46

పవన్ కళ్యాణ్ - డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. షూటింగ్, ఇతర పనులూ ఆలస్యం లేకుండా జరుగుతున్నాయి. 

56

అయితే Ustaad Bhagat Singhలో ఇప్పటికే యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)  హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ గా సాక్షి వైద్య పేరు వినిపిప్తోంది. సెంకడ్ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది. 

66

దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. నిజమైతే మాత్రం సాక్షి కెరీర్ మలుపు తిరగడం ఖాయమనే చెప్పాలి. తనకిచ్చిన పాత్రలో ప్రేక్షకులను మెప్పించగలిగితే కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో వెలుగొందే అవకాశం లేకపోలేదని అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories