గ్రీన్ సూట్ లో సదా స్టైలిష్ లుక్.. నడుము చూపిస్తూ.. హుషారుగా ఫోజులిచ్చిన ‘జయం’ భామ.. పిక్స్

First Published | Apr 4, 2023, 5:55 PM IST

‘జయం’ హీరోయిన్ సదా (Sadha) స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ లో సదా స్టైలిష్ గా దర్శనమిచ్చింది.  
 

సీనియర్ నటి సదా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే దక్కించుకుంది. తెలుగు, తమిళ చిత్రాల్లోని బడా స్టార్స్ సరసన నటించి సౌత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. తన  అందం, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకున్నారు. 
 

‘జయం’ చిత్రంతో హీరోయిన్ గా అవకాశం అందుకున్న సదా  తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును సైతం  దక్కించుకుంది. మూవీ విజయవంతం అవడంతో సదాకు తెలుగులోనే భారీ ఆఫర్లు వచ్చాయి. 
 


అలా ఎన్టీఆర్, నితిన్, ఉదయ్ కిరణ్, విక్రమ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.  ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. పాపులర్ డాన్స్ షో ‘ఢీ14’ సీజన్ తో సదా టీవీ ఆడియెన్స్ ను అలరించింది. 

ఇక కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు సదా సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఈక్రమంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. స్టన్నింగ్ ఫొటోషూట్లతో రచ్చరచ్చ చేస్తోంది. 

కుర్ర హీరోయిన్లకే షాకిచ్చేలా స్టైలిష్ వేర్స్ లో మెరుపు మెరిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా సదా గ్రీన్ సూట్ లో స్టైలిష్ గా లుక్ లో దర్శనమిచ్చింది. నడుము అందాలను చూపించేలా ఫొటోలకు ఫోలిచ్చింది. 

తాజా ఫొటోషూట్ లో చాలా హుషారుగా స్టిల్స్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అదిరిపోయే లుక్స్ తో నెటిజన్లను సైతం తనవైపు తిప్పుకుంటోంది. సదా సూపర్ లుక్స్ కు ఫ్యాన్స్ కూడా  ఫిదా అవుతున్నారు. ఆమె ఫొటోలకు లైక్స్, కామెంట్లు పెడుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే.. ఐదేండ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సదా ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సదా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే నెట్టింట క్రేజీ  పోస్టులు పెడుతూ ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది.
 

బుల్లితెరపై మొన్నటి వరకు సందడి చేసిన సదా.. ‘హాల్ వరల్డ్’ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. చాలా  కాలం తర్వాత ఈసిరీస్ తో మెరవడం అభిమానులను ఖుషీ చేసింది. పెళ్లికి  కూడా దూరంగానే ఉంటున్న ఈ భామ రీఎంట్రీ ఎప్పుడు  ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
 

Latest Videos

click me!