20 ఏళ్లు సినిమాలకు దూరం.. రేణు దేశాయ్ ఇన్ కమ్ సోర్స్ ఏంటీ.? నెట్ వర్త్? నెక్ట్స్ స్టెప్?

First Published | Oct 19, 2023, 1:42 PM IST

సీనియర్ నటి రేణు దేశాయ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. 20 ఏళ్ల తర్వాత రేపటి  ‘టైగర్ నాగేశ్వర రావు’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఇన్నాళ్లు ఆమెకు ఆదాయం ఎలా వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. 

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సీనియర్ నటి రేణు దేశాయ్ (Renu Desai)  గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సరసన  ‘బద్రీ’, ‘జానీ’ వంటి చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత మళ్లీ 20 ఏళ్లకు వెండితెరపై ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో అలరిస్తోంది. రవితేజ - నుపూర్ సనన్ జంటగా నటించిన ఈ చిత్రంలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే సంఘసంస్కర్త పాత్రను పోషించింది. 


ఈ అద్భుతమైన రోల్ ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. రేపు Tiger Negeswara Rao  గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రేణు దేశాయ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు వైరల్ గా మారాయి. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమెకు ఆదాయం ఎలా సమకూరిందనేది ఆసక్తికరంగా మారింది.
 

20 ఏళ్లు రేణు దేశాయ్ కి సినిమాల ద్వారా ఆదాయం రాలేదు. కానీ వాళ్ల నానమ్మ, నాన్న వృత్తి అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారానే సంపాదన వచ్చిందంట. అదే ఇన్నాళ్లు మెయిన్ ఆదాయమార్గం అంటూ రీసెంట్ ఇంటర్వ్యూల్లోనూ తెలియజేసింది. 
 

హైదరాబాద్, పూణేలో ఎక్కువగా ఈ బిజెనెస్ జరుగుతుందని తెలుస్తోంది. ఆ నగరాల్లో బాగానే ఆస్తులు కూడా ఉన్నాంట. వాటి నుంచి వచ్చే ఆదాయంతోనే ఇన్నాళ్లు గడిపినట్టు తెలుస్తోంది. ఇక ఓ సినిమానూ కూడా నిర్మించింది. కొన్ని నివేదికల ప్రకారం.. రేణు దేశాయ్ ఆస్తుల విలువ మొత్తం రూ.40 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. 
 

ఇన్నాళ్లు రేణుదేశాయ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో మరిన్ని సినిమాలు చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ డైరెక్షన్ లో కెరీర్ ను ముందుకు తీసుకెళ్తానంటూ తన నెక్ట్స్ స్టెప్ ను తెలియజేసింది. 2014లో వచ్చిన ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను నిర్మించి, డైరెక్ట్ చేసింది. అలాగే పలు విభాగాల్లోనూ వర్క్ చేసిన అనుభవం ఉంది. 
 

Latest Videos

click me!