‘మూవీ ఛాన్స్ అడిగితే.. అడ్జస్ట్ మెంట్ అడిగారు’.! రెజీనా షాకింగ్ కామెంట్స్..

First Published | Aug 17, 2023, 3:54 PM IST

యంగ్ హీరోయిన్ రెజీనా (Regina) తాజా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానంటూ ఓపెన్ అయ్యింది. ఛేదు అనుభవాన్ని బయటపెట్టింది.
 

తమిళ బ్యూటీ, యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన నటన, గ్లామర్ తోనూ ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. 
 

ప్రస్తుతం రెజీనా తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. అయితే పెద్దగా హిట్లు లేకపోవడంతో అవకాశాలు అందలేదు. కానీ వచ్చిన ఆఫర్లను మాత్రం రెజీనా వినియోగించుకుంటూనే ఉంది. చివరిగా ‘శాకినీ డాకినీ’ అనే చిత్రంతో అలరించింది. 
 


ప్రస్తుతం తమిళంలోనే మూడు చిత్రాల్లో నటిస్తోంది. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉంది. కోలీవుడ్ లోనే సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. 
 

రెజీనా మాట్లాడుతూ తను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్టు, ఆ ఘటనను సైతం వివరించినట్టు కోలీవుడ్ మీడియాలో పేర్కొన్నారు.  2005లో తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం కొందరిని అప్రోచ్ అయ్యాను. దాంతో ఒకరు ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తామనని చెప్పారు. కానీ అడ్జస్ట్ మెంట్ కు ఓకే అంటేనే తర్వాత షూటింగ్ పని చూసుకోవచ్చని అన్నారు. నాకు అతని మాటలు అర్థం కాలేదు.
 

ఎదుకంటే, అప్పటికీ నాకు అడ్జస్ట్ మెంట్ అంటే కూడా తెలియదు. ఏదో రెమ్యునరేషన్ విషయం మాట్లాడుతున్నారేమో అని, నా మేనేజర్ మీతో మాట్లాడుతాడని ఫోన్ కట్ చేశాను. ఇది జరిగి 10 పదేళ్లు జరిగిపోయింది. అప్పుడు నాకు 20 ఏళ్ల వయస్సు ఉంటుంది.’ అని చేధు అనుభవాన్ని చెప్పుకొచ్చారు.   

Meetoo ఉద్యమం తర్వాత సినీ ఇండస్ట్రీలో పైస్థాయిలో ఉన్న నటీమణులు కూడా తమకు జరిగిన చేధుఅనుభవాలను ధైర్యంగా చెబుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెజీనా కామెంట్స్  వైరల్ గా మారింది. చివరిగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘ఆచార్య’లో ఐటెం సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. 
 

Latest Videos

click me!