ట్రెడిషనల్ లుక్ లో ‘జైలర్’ కోడలు బ్యూటీఫుల్ లుక్.. మిర్నా మీనన్ గురించి మీకు తెలుసా?

First Published | Aug 17, 2023, 2:48 PM IST

‘జైలర్’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. తన నటనతో ఆకట్టుకున్న మిర్నా మీనన్ తెలుగులోనూ సినిమాలు చేసింది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 
 

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న హీరోయిన్లు ఊహించని విధంగా స్టార్ డమ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం మలయాళీ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ (Mirna Menon) పేరు బాగా వినిపిస్తోంది. భారీ చిత్రంలో కీలక పాత్రతో అదరగొట్టింది. 
 

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ‘జైలర్’ మూవీలోనే మిర్నా మీనన్ నటించడం  విశేషం. ఈ చిత్రంలో రజినీకాంత్ కు కోడలి పాత్ర పోషించి మెప్పించింది. తన అద్భుతమైన పెర్ఫామెన్స్ ను ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 


అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తెలుగు రెండు సినిమాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు సాధించుకోలేకపోయింది. ఆది సాయి కుమార్ సరసన ‘క్రేజీ ఫెలోస్’,  అల్లరి నరేశ్ సరసన ’ఉగ్రం’లో  ఫీమేల్ లీడ్ రోల్స్ లో  నటించింది. కానీ పెద్దగా ఫేమ్ కాలేదు.
 

‘జైలర్’తో మాత్రం మిర్నా మీనన్ కు కావాల్సినంత క్రేజ్ దక్కింది. తన నటనకు వందశాతం మార్కులు అందాయి. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని ఆఫర్లు ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఈ క్రమంలో మిర్నా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. అయితే వెండితెరపై కాస్తా పద్ధతిగా కనిపించినా నెట్టింట మాత్రం గ్లామర్ తో మోత మోగిస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ చేసిన ఫొటోషూట్లు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. తెలుగులో గ్లామర్ రోల్స్ లో దుమ్ములేపుతుందని భావిస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే.. మిర్నా తాజాగా చక్కగా, పద్ధతిగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. యాష్ కలర్ చుడీదార్ లో బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చింది. అందంగా నవ్వుతూ ఫ్యాన్స్ ను పలకరించింది. ‘తన మామ  టైగర్ ముత్తువేల్ పాండియన్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 

Latest Videos

click me!