పొట్టి డ్రెస్ లో రెజీనా స్టన్నింగ్ పోజులు.. టైట్ ఫిట్ లో పరువాలతో మతులు పోగొడుతున్న తేజూ భామ

First Published | May 2, 2023, 6:02 PM IST

యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra) లేటెస్ట్ లుక్ లో కట్టిపడేస్తోంది.  స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది. 
 

సాయి ధరమ్ తేజ్ సరసన ‘పిల్లా నువ్వులేని జీవితం’లో నటించిన రెజీనా కసాండ్రా హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ బ్యూటీ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. తేజూ సరసన వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’తోనూ మరింత క్రేజ్ దక్కించుకుంది. 
 

తమిళనాడు కు చెందిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లపాటు టాలీవుడ్ లోనూ సందడి చేసింది. ‘శౌర్యం, జ్యో అచ్యుతానంద, శంకర, అ’ వంటి చిత్రాలతో అలరించింది. వరుస ఆఫర్లు దక్కించుకున్న వాటి ఫలితాలతో రెజీనా నెక్ట్స్ లెవల్ కు చేరుకోలేపోయింది. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. 
 


మరోవైపు ఆయా ఈవెంట్లకు కూడా రేజీనా హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన GQ3 మోస్ట్ ఇన్ ఫ్ల్యూయెన్షియల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.  ఆ ఈవెంట్ లో ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. తాజాగా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోల్లో రేజీనా స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది.  అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది.  మరోవైపు పొట్టి డ్రెస్ లో గ్లామర్ మెరుపులు  కూడా మెరిపిస్తూ మైమరిపించింది. టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

చివరిగా రెజీనా ‘శాకినీ డాకిని’ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రెజీనా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం మారిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి మ్యాగీ పాప అంటూ కూడా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్న విషయం తెలిసిందే.  ఏదేమైనా రెజీనా మాత్రం తన కేరీర్ ను గాడీలో పెట్టే ప్రయత్నం చేస్తోంది.
 

తెలుగు సినిమాల్లో ప్రస్తుతం నటించకపోయినా.. తమిళ సినిమాలతో మాత్రం బిజీగా ఉంది.  ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా నాలుగు చిత్రాలు ‘బార్డర్’, ‘ఫ్లాష్ బ్యాక్’, ‘కరుంగాపియమ్’, ‘శూర్పనాగై’లో నటిస్తూ బిజీగా  ఉంది. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 

Latest Videos

click me!