ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే హీరోయిన్‌గా టాప్ రేంజ్‌కు వెళ్లిన బ్యూటీ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీలో కిరికి పార్టీతో పరిచయం అయిన ఈ బ్యూటీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి మహేష్ ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు మెయిన్‌టైన్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా నమ్రతకు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.