పొట్టి గౌన్ లో రకుల్ ప్రీత్ సింగ్ కిర్రాక్ ఫోజులు.. ఇంత వర్షంలోనూ అది మానట్లేదు..

First Published | Jul 23, 2023, 5:29 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు. దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ ఢిల్లీ భామ స్టన్నింగ్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  ఊపూపిన విషయం తెలిసిందే. ఐదేళ్ల పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇప్పుడిప్పుమే మళ్లీ  సౌత్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది. 
 

నార్త్ లో గతేడాది దుమ్ములేపిన రకుల్ కు ప్రస్తుతం అక్కడ ఆఫర్లు లేవు. దీంతో మళ్లీ ఇక్కడి ప్రేక్షకులనే అలరించేందుకు దక్షిణాది చిత్రాలపై దృష్టి పెట్టింది. తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. షూటింగ్ కు గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్లకూ వెళ్తోంది.
 


ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీతో పాటు వెకేషన్ ను పూర్తి చేసుకొని వచ్చినట్టు తెలుస్తోంది. దుబాయ్ లో సందడి చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా మినీ గౌన్ లో గ్లామర్ మెరుపులూ మెరిపించింది.
 

లేటెస్ట్ గా రకుల్ షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. మినీ గౌన్ లో ఈ ముద్దుగుమ్మ అందాల విందు చేసింది. మరీ చిన్న డ్రెస్ లో థైస్ షో చేస్తూ మతులు పొగొట్టింది. మరోవైపు బ్యూటీఫుల్ స్మైల్, కిర్రాక్ స్టిల్స్ తో ఆకట్టుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఎప్పుడూ ఏదోలా వైరల్ అవుతూనే ఉంటుంది. ఎక్కువ వర్కౌట్స్ కు వెళ్తూ కనిపిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ డాన్స్ సెషన్ కు వర్షంలోనూ మిస్ చేయకుండా వెళ్తూ కనిపించింది. వానలో గొడుగు తీసుకొని మరీ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
 

ఇక రకుల్ ఫిట్ నెస్ విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తారో తెలిసిందే. అలాగే తన సినిమా విషయాల్లోనూ అంతే ఫోకస్డ్ గా ఉంటారు. ప్రస్తుతం రకుల్ తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే శివ కార్తీకేయన్ తో ‘ఆయలాన్’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!