రష్మిక మందన్న చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్.. అరడజన్ చిత్రాలతో నేషనల్ క్రష్ ఫుల్ బిజీ!

First Published | Oct 2, 2023, 4:04 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లైనప్ ఏమాత్రం తగ్గడం లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకుంటూ టాలీవుడ్ ను ఏలుతోంది. ఎంత మంది తారలు వచ్చినా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తగ్గడం లేదు. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఆ సినిమాల వివరాల విషయానికొస్తే.. 
 

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandann)  టాలీవుడ్ చిత్రాలతోనే ఎదిగిన విషయం తెలిసిందే. ‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి చిత్రాలు ఆమెను ఆడియెన్స్ కు బాగా దగ్గర చేశాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన ‘పుష్ప’తో ఏ రేంజ్ క్రేజ్ దక్కించుకుందో తెలిసిందే. శ్రీవల్లిగా రష్మిక ఇచ్చిన పెర్ఫామెన్స్ కు నేషనల్ క్రష్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘పుష్ప’ కు సీక్వెల్ గా వస్తున్న Pushpa 2 The Ruleలో నటిస్తోంది. రష్మిక ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్  ఇది బిగ్ ఫిల్మ్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత రష్మిక మరింత పాపులారిటీని దక్కించుకోనుంది.
 

రష్మిక లైనప్ లోని మరో బిగ్ ప్రాజెక్ట్ ‘యానిమల్’ (Animal). హిందీలో రూపుదిద్దుకుంటోంది. ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గానే రష్మిక ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంది. అలాగే ఇటీవల వచ్చిన టీజర్ కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 1న ‘యానిమల్’ అన్ని భాషల్లో విడుదల కానుంది.


డాషింగ్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న ‘గీతాగోవిందం’ చేసిన విషయం తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం విజయ్ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో VD12 రూపుదిద్దుకుంటోంది. పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. మొదటి శ్రీలీలాను ఎంపిక చేసినా.. చివరిగా రష్మికను ఫైనల్ చేశారని తెలుస్తోంది. త్వరలో రష్మిక కథానాయిక అంటూ అఫీషియల్ అప్డేట్ కూడా రానుంది. ఇక విజయ్ - రష్మిక కెమిస్ట్రీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మళ్లీ ఈ సినిమా సెట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
 

అలాగే మాస్ రాజా రవితేజ - గోపీచంద్ మాలినేని కాంబినేషన్ నాలుగోసారి సెట్ అయిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పై  
RT4GM వర్క్ టైటిల్ తో అనౌన్స్ మెంట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న ఎంపికైందని తెలుస్తోంది. మొదటిసారిగా రష్మిక మాస్ రాజా సరసన నటించబోతోంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

తెలుగుతో పాటు రష్మిక మందన్న అటు తమిళంలోనూ బిగ్ ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంటోంది. ఇప్పటికే ‘సుల్తాన్’, ‘వారసుడు’ వంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్ ప్రాజెక్ట్ D51లో నటిస్తోంది. తమిళ స్టార్ ధనుష్ సరసన నేషనల్ క్రష్ నటించబోతుండటం ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది. ఈ చిత్రం తెలుగులోనే రూపుదిద్దుకుంటుండటం విశేషం. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటం మరింత ఆసక్తి నెలకొంది. 
 

తమిళం, తెలుగులో బైలింగ్వుల్ గా రూపుదిద్దుకుంటున్న రష్మిక మందన్న మరో చిత్రమే ‘రెయిన్ బో’ (Rainbow). శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫీమేల్ సెంట్రిక్ గా రూపుదిద్దుకుంటోంది. దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంపైనా రష్మిక అభిమానుల్లో అంచనాలున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు నటుడు, డైరెక్టర్ రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలోనూ మరో లేడీ ఓరియెంట్ ఫిల్మ్ రాబోతుందని అంటున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి  ఉంది. 
 

Latest Videos

click me!