ప్రముఖ నటి రజిత టాలీవుడ్ లో దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. వందల సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. తల్లి, అత్త, వదిన తరహా పాత్రల్లో ఆమె ఎక్కువగా నటించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, ఎఫ్ 2, ప్రతిరోజూ పండగే, సంక్రాంతికి వస్తున్నాం ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. రజిత నటించిన లేటెస్ట్ మూవీ దొంగ నా కొడుకు. ఈ చిత్రంలో యుంగ్ సెన్సేషన్ మౌళి తనూజ్ హీరో.