
యంగ్ హీరో నితిన్ చాలా ఒక దశాబ్దంపైగా వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఇష్క్ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా నితిన్ పరిస్థితి దాదాపుగా అలాగే ఉంది. భీష్మ తర్వాత నితిన్ కి సరైన హిట్ లేదు. వరుస ఫ్లాపులు వేధిస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ రూట్ మార్చి అలియాస్ రుక్మిణి అనే సాఫ్ట్ అండ్ రొమాంటిక్ మూవీతో రాబోతున్నారు.
నితిన్ కి స్టార్ హీరో అయ్యే అవకాశం పలుమార్లు చేజారింది. కెరీర్ బిగినింగ్ లో జయం, దిల్, సై లాంటి చిత్రాలతో నితిన్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. దీనితో నితిన్ తో సినిమా చేసేందుకు రాఘవేంద్ర రావు లాంటి అగ్ర దర్శకులు కూడా ముందుకు వచ్చారు. అయినప్పటికీ నితిన్ స్టార్ కాలేకపోయాడు. పదేళ్ల పాటు వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. ఇక కెరీర్ ముగిసింది అనుకుంటున్న తరుణంలో ఇష్క్ మూవీ వచ్చింది. ఆ చిత్రం నితిన్ కెరీర్ కి తిరిగి ఊపిరి పోసింది. ఆ తర్వాత వెంటనే నితిన్ చేసిన గుండె జారి గల్లంతయ్యిందే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. స్టార్ హీరోల సినిమాలకు పోటీగా ఆ మూవీకి కలెక్షన్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ అభిమాని అనే ట్యాగ్ తో నితిన్ కి విపరీతమైన హైప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఫ్లాపులు తప్పలేదు.
ఆ టైంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన అ..ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. అప్పుడప్పుడూ హిట్స్ పడుతున్నా నితిన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం లేదు. గుండెజారి గల్లంతయ్యిందే మూవీ టైంలో జరిగిన ఒక సంఘటనని రచయిత, నటుడు హర్షవర్ధన్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. గుండె జారీ గల్లంతయ్యిందే ఆడియో లాంచ్ లో తనకు అవమానం జరిగింది అని తెలిపారు. ఆ సంఘటనని నితిన్ కి చెప్పినప్పటికీ క్షమాపణ చెప్పకపోగా తనకే క్లాస్ పీకాడని హర్ష వర్ధన్ అన్నారు.
గుండెజారి గల్లంతయ్యిందే ఆడియో ఫంక్షన్ లో యాంకర్ అందరినీ పిలుస్తూ నా పేరు కూడా పిలిచింది. ఒక్కొక్కరుగా స్టేజీపైకి వెళుతున్నారు. నా పేరు కూడా వచ్చింది. హర్షవర్ధన్ గారు అని యాంకర్ పిలిచారు. నేను వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి. కానీ ఆ పేరు పిలిచిన వెంటనే హర్షవర్ధన్ రాణే అనే నటుడు స్టేజీపైకి వెళ్ళాడు. ఓహో అంటే పిలిచింది నన్ను కాదు..అతడినా.. సరే నా పేరు పిలిచే వరకు వెయిట్ చేద్దాం అని కూర్చున్నా. నన్ను పిలిస్తే రైటర్ హర్షవర్ధన్ అని పిలుస్తారేమో అని అనుకున్నా. స్టేజీపైకి వెళ్లిన హర్షవర్ధన్ రాణేకి ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. నితిన్ కి పరిచయం ఉన్న వ్యక్తి అంతే. ఎంత ఎదురు చూసినా నా పేరు రాలేదు. నితిన్ కూడా మాట్లాడేస్తున్నాడు. కనీసం నితిన్ అయినా గుర్తు చేసుకుని నన్ను పిలుస్తాడేమో అని అనుకున్నా. అది కూడా జరగలేదు.
నేను కోపంతో వెళ్ళిపోయా. అప్పటికీ ఆ మూవీ షూటింగ్ చిన్న పార్ట్ మిగిలి ఉంది. ఆడియో లాంచ్ అయ్యాక ఆ మిడ్ నైట్ షూటింగ్ ఉంది. నితిన్ నాకు ఫోన్ చేసి హర్ష నేను కాస్త లేట్ గా షూటింగ్ కి వస్తా అని చెప్పాడు. నాకేం సంబంధం లేదు నేను రాను అని చెప్పా. ఏమైంది అని అడిగాడు.. అయింది చాల్లే అని అన్నాను. అప్పుడు నితిన్ కి గుర్తుకు వచ్చి అవును నువ్వు స్టేజీపై ఎందుకు లేవు అని అడిగాడు.. సరే వెంటనే నువ్వు నా దగ్గరికి రా అని పిలిచాడు. హమ్మయ్య ఇప్పటికైనా గుర్తుకు వచ్చా.. సారీ చెబుతాడేమో అని అనుకుని వెళ్ళా. ఏంటి నీ ప్రాబ్లెమ్ అని అడిగాడు.. నన్ను స్టేజీపైకి పిలవలేదు కదా అని అడిగా. నీ పేరు పిలిచారు కదా.. ఎందుకు రాలేదు అని నితిన్ ప్రశ్నించాడు. వేరే వ్యక్తి వచ్చాడు కదా అని అన్నాను. అతని పేరు హర్షవర్ధన్ రాణే.. అక్కడ పిలిచింది హర్షవర్ధన్.. నువ్వెందుకు రాలేదు.. అదే కదా నీ పేరు అని నితిన్ నాకు రివర్స్ కౌంటర్లు స్టార్ట్ చేశాడు. నీ పేరు పిలిచినా నువ్వు రాకపోగా నేను షూటింగ్ కి రాను.. తప్పు నాదే అని అంటావా. అక్కడ స్టేజీపై 30 మంది ఉంటారు. ప్రతి ఒక్కరూ ఉన్నారా లేదా అని చూసి గుర్తించుకుని మాట్లాడడం ఎంత కష్టమో తెలుసా.. రేపు ఈ సినిమా సక్సెస్ అయ్యాక నీకే మైక్ ఇస్తా.. అందరినీ గుర్తు పెట్టుకుని మాట్లాడతావా..అప్పుడు తెలుస్తుంది స్టేజీపై మాట్లాడడం, అందరినీ గుర్తుంచుకోవడం ఎంత కష్టమో అని .. అంటూ నితిన్ ఊహించని కౌంటర్ దెబ్బకు సైలెంట్ అయిపోయా. తప్పు నాదే అని అర్థం అయింది అంటూ హర్ష వర్ధన్ తెలిపారు.