మంచి మాస్ ఎలమెంట్స్ ఉండటంతో ఈ మూవీ అప్పట్లో కొన్ని థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది. ఈ సందర్భంగా గతంలో ఈ హిట్ చిత్రంపై సీనియర్ నటి, ఒకప్పటి ఫ్యామిలీ హీరోయిన్ రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 1999లో సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా రాశిని సంప్రదించగా దీనికి ఆమె నో చెప్పిందట. అదే సంవత్సరం రాశి నేటి గాంధీ, స్వప్న లోకం, డాడీ డాడీ, వీడు సామన్యుడు కాదు, తదితర సినిమాల్లో నటించింది.