Published : Apr 24, 2022, 12:43 PM ISTUpdated : Apr 24, 2022, 12:44 PM IST
తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) లేటెస్ట్ ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. ప్రియాంక మోహన్ గ్లామర్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
తమిళ హీరోయిన్ ప్రియాంక మోహన్ తొలుత కన్నడలో ‘ఒంద్ కతే హెల్లా’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈ సుందరి నటన, గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అవడంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
26
నేచురల్ స్టార్ నానితో (Nani)తో కలిసి ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం అవరేజ్ గా ఆడినా.. ప్రియాంక అరుళ్ మోహన్ కు మాత్రం మంచి గుర్తింపును తెచ్చింది.
36
ఆ వెంటనే హీరో శర్వానంద్ తో కలిసి ‘శ్రీకారం’లో నటించింది. ఈ చిత్రం కూడా అవరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే వరుసగా రెండు తెలుగు సినిమాలు తనకు మిశ్రమ స్పందన పొందడంతో ప్రియాంకకు కూడా పాపులారిటీ రాలేదు.
46
కానీ ఆ రెండు సినిమాల్లో తన నటన, గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. ఇంతలో తమిళ ఇండస్ట్రీని నుంచి పిలుపురావడంతో ఈ బ్యూటీ తమిళ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైంది. ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది.
56
అయితే ప్రియాంక తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా.. తమిళంలో తను నటిస్తున్న మూవీలు తెలుగు డబ్బింగ్ ద్వారా రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులకు, తన అభిమానులను అలరిస్తూనే ఉంది.
66
మరోవైపు సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. తాజాగా స్టైలిష్ సూట్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చిందీ బ్యూటీ. దీంతో తన అభిమానులు ఫిదా అవుతున్నారు. తన గ్లామర్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నారు.