అలా మెరిసి ఇలా మాయమైంది.. అయినా ప్రియాంక మోహన్ కు ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదుగా!

First Published | Mar 5, 2023, 12:13 PM IST

తెలుగులో కేవలం రెండు చిత్రాల్లో మెరిసి మాయమైపోయింది యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan). కానీ, సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూనే ఉంది. తాజాగా బ్యూటీఫుల్ పిక్స్ ను పంచుకుంది. 
 

తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ ప్రస్తుతం తెలుగు చిత్రాలవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కానీ యంగ్ బ్యూటీ తెలుగులో తన తొలిచిత్రంతోనే మంచి గుర్తింపున దక్కించుకుంది. అందం, అభినయంతో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది. 
 

నేచురల్ స్టార్ నాని (Nani) సరసన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘శ్రీకారం’ చిత్రంలో మెరిసింది. ఈ రెండు చిత్రాలు ప్రియాంకకు ఆశించిన మేర ఫలితాలను ఇవ్వలేకపోయాయి. 
 


తెలుగులో కలిసి రాకపోవడంతో ప్రస్తుతం తమిళ  చిత్రాలపైనే ఫోకస్ పెట్టిందీ ముద్దుగుమ్మ. వరుసగా ఆఫర్లు అందుకుంటున్న సాలిడ్ హిట్ ను దక్కించుకోలేకపోతోంది. అందం, నటన ఉన్నప్పటికీ సరైన సక్సెస్ రాకపోవడంతో కేరీర్ కూడా కాస్తా నెమ్మదిగానే నడుస్తున్నట్టు తెలుస్తోంది. 
 

ఇక సినిమాల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా  ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. తమిళ బ్యూటీ బ్యూటీఫుల్ లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది.
 

స్కిన్ షోకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఈ బ్యూటీ పద్దతిగానే మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ట్రెడిషనల్ వేర్స్, ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ కట్టిపడేస్తోంది. తాజాగా వైట్ షర్ట్, స్కర్ట్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు చురకత్తుల్లాంటి చూపులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. 
 
 

చూడచక్కని రూపసౌందర్యంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి తెలుగులో సినిమాల పరంగా అవకాశాలు లేకున్నా.. తెలుగు ఫ్యాన్స్ లో ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ప్రియాంక పంచుకునే పోస్టులను క్షణాల్లోనే నెట్టింట వైరల్ చేస్తున్నారు. లైక్స్, కామెంట్లతో ప్రియాంక అందాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రియాంక మోహన్ ప్రస్తుతం తమిళంలో ‘కెప్టెన్ మిల్లర్’  చిత్రంలో నటిస్తోంది. అలాగే దర్శకుడు ఎం రాజేశ్ సినిమాలోనూ నటిస్తున్నారు. 

Latest Videos

click me!