ప్రియమణికి మాటిచ్చిన అల్లు అర్జున్.. ఏం చేయబోతున్నాడంటే..?

Mahesh Jujjuri | Published : Oct 11, 2023 1:41 PM
Follow Us

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సీనియర్  హీరోయిన్ ప్రియమణి ఓ మాట ఇచ్చాడంట.. ఇంతకీ ఆయన ఏమని మాట ఇచ్చాడు.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి కెరీర్ లో  దూసుకుపోతుంది. ఈక్రమంలో ఆమె చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

16
ప్రియమణికి మాటిచ్చిన అల్లు అర్జున్.. ఏం చేయబోతున్నాడంటే..?

హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలిన ప్రియమని.. పెళ్ళి తరువాత కొంత కాలం స్క్రీన్ కు దూరం అయింది. . ఆతరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను పక్కా ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసింది. వరుసగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది హీరోయిన్ ప్రియమణి. ముఖ్యంగా ఆమె చేసిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సూపర్ హిట్అయ్యింది. ప్రియమణికి మంచి ఇమేజ్ వచ్చింది. వరుస ఆఫర్లను కూడా తీసుకువచ్చింది.

26
Priyamani

టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సరసన మెరిసింది బ్యూటీ..  త్రిష,శ్రియా లాంటి హీరోయిన్లతో సమానంగా టాలీవుడ్ ను ఏలింది హీరోయిన్ ప్రియమణి. ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోలతో.. జగపతి బాబు లాంటి సీనియర్ స్టార్లతో కూడా జతకట్టిన మలయాళ బ్యూటీ.... పెళ్ళి తరువాత కొంత కాలం పాటు వెండితెరకు దూరం అయ్యింది. ఇప్పుడు రీ ఎంట్రీలో రచ్చ చేస్తోంది. 
 

36

ఇటు టాలీవుడ్ లోను... అటు బాలీవుడ్ లోను దూసుకుపోతోందిప్రియమణి. ఆమెకు వచ్చే క్యారెక్టర్ రోల్స్ కూడా అందరూ గుర్తు పెట్టుకునే విధంగా ఉంటున్నాయి. తాజాగా బాలీవుడ్ బాద్ షా.. షారుక్‌ ఖాన్‌  బ్లాక్‌ బస్టర్‌  మూవీ జవాన్‌ లో ఇంపార్టెంట్ రోల్ చేసింది ప్రియమణి. ఇందులో ఆమెది చాలా  కీలక పాత్ర. ఇక ఈమూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రియమణి  ఓ ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా చెప్పుకొచ్చింది. 
 

Related Articles

46

ఇక ప్రస్తుతం ప్రియమణి పుష్ప2 లో నటిస్తోంది అంటూ టాక్ గట్టిగా నడుస్తోంది.  ఈసినిమాలో ఆమెది అద్భుతమైన పాత్ర అని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన లేదు. దాంతో ఈ విషయం గురించి తాజాగా క్లారిటీ ఇచ్చింది బ్యూటీ. పుష్ప 2 సినిమాలో నేను నటిస్తున్నాను అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు ప్రియమణి.  అయితే ఎప్పటి నుంచో నాకు అల్లు అర్జున్ సినిమాలో నటించాలి అనే కోరిక ఉంది.. అలాంటి అవకాశం వస్తే నేను అసలు వదులుకోనని అంటుంది హీరోయిన్. 

56

అంతే కాదు కెరీర్ లో  తప్పకుండా ఒక్క సారి అల్లు అర్జున్ సినిమాలో నటిస్తానని ఈమె అన్నారు. ఇక మరో విషయం ఏంటీ అంటే.. ప్రియమణి కోరిక గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ మాత్రం ఒక ఈవెంట్ కనిపించి ఆమెకు మాటిచ్చాడట.  అల్లు అర్జున్ కలిసినప్పుడు ఆయన మీ కోరిక తొందరలోనే తీరుతుంది అంటూ నాకు మాట ఇచ్చారని ప్రియమణి అన్నారు. 

66
actress priyamani says she is 39 year old and next year her touch 40

అంతే కాదు.. ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా  ప్రియమణి నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అది కూడా ఎన్టీఆర్ తల్లి పాత్ర అట. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న క్రమంలో ప్రియమణి ఎన్టీఆర్ తల్లి, భార్య రెండు పాత్రల్లో కనిపిస్తారట. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని...ప్రచారం మాత్రం జరుగుతోంది. 

Read more Photos on
Recommended Photos