ట్రెండీ వేర్ లో ‘బ్రో’ బ్యూటీ మెరుపులు.. టాప్ గ్లామర్ తో ప్రియా వారియర్ రచ్చ..

First Published | Sep 29, 2023, 5:52 PM IST

మలయాళ యంగ్ బ్యూటీ ప్రియా వారియర్ అందాల దర్శనంతో నెట్టింట దుమారం రేపుతోంది. నయా లుక్స్ లో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా  ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు అట్రాక్ట్ చేస్తున్నాయి. 
 

కన్ను గీటు వీడియోతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier)  దేశ వ్యాప్తంగా  పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఒక్క వీడియోతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకుంది. దీంతో మలయాళంతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ అవకాశం అందుకుంది.
 

‘ఒరు అదార్ లవ్’ చిత్రంతో మంచి పాపులారిటీని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. ‘చెక్’, ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, అనుకున్నస్థాయిలో క్లిక్ కాలేకపోయింది. 
 


దీంతో మలయాళంలో సినిమాలు చేస్తూనే ప్రియా వారియర్ చూపు బాలీవుడ్ పై పడింది. ప్రస్తుతం హిందీలో రెండు, మూడు సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ  సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఆకట్టుకుంటోంది.
 

నెట్టింట నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ తన నయా లుక్స్ తో మంత్రముగ్ధులను చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. గ్లామర్ మెరుపులతో చూపుతిప్పుకోకుండా చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.

యంగ్ బ్యూటీ ప్రియా వారియర్ తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ట్రెండీ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. టాప్ గ్లామర్ తో మతులు పోగొట్టింది. క్యూట్ ఫోజులతో, బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

ఇక తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన Bro The Avatar లో ప్రియా వారియర్ కీలక పాత్ర పోషించింది. తేజూ చెల్లెలిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లోని ‘యారియన్ 2’, ‘3 మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’, ‘శ్రీదేవి బంగ్లా’ వంటి సినిమాలు చేస్తోంది. కన్నడలో ‘విష్ణు ప్రియా’ సినిమాలో నటిస్తోంది.
 

Latest Videos

click me!