రెండో పెళ్ళికి సిద్దమైన సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రేమ... అసలు విషయం ఇది!

First Published Jun 3, 2021, 10:22 AM IST


స్టార్ హీరోయిన్ గా తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరసన చేశారు ప్రేమ. 1995లో విడుదలైన కన్నడ చిత్రం సవ్యసాచి ప్రేమకు మొదటి చిత్రం. తెలుగులో ఆమె వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు వంటి హీరోల పక్కన నటించారు. 
 

మళయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్ కి జంటగా నటించారు. తెలుగు, కన్నడ బాషలలో ఆల్ టైం హిట్ గా నిలిచిన ఉపేంద్ర సినిమాలో ప్రేమ బోల్డ్ రోల్ చేశారు. ఆమె ఓ సన్నివేశంలో వేశ్యగా నటించడం విశేషం.
undefined
తెలుగులో ధర్మ చక్రం, దేవి వంటి సినిమాలు ఆమెకు భారీ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. 2005వరకు కూడా ప్రేమ విరివిగా సినిమాలు చేశారు. ఓ దశ తరువాత ఆమెకు మెయిన్ హీరోయిన్ రోల్స్ తగ్గిపోయాయి.
undefined
2009 తరువాత సినిమాల నుండి గ్యాప్ తీసుకున్న ప్రేమ 2017లో కన్నడ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. కాగా మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న ప్రేమపై కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె ఆరోగ్యం సరిగా లేదని, అలాగే రెండో వివాహం చేసుకోనున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి.
undefined
కాగా ఈ కథనాలపై ప్రేమ స్పందించారు. తనకు క్యాన్సర్ సోకిందని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. అలాగే తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాలలో ఉన్న మాట కూడా నిజం కాదని, సింగిల్ గా జీవితం చాలా బాగుందని, ఇలానే ఉంటానని తెలియజేశారు.
undefined
నటిగా ఫుల్ బిజీగా ఉన్నప్పుడే 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పఛు ని వివాహం చేసుకున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ వీరు పదేళ్ల వైవాహిక జీవితం తరువాత 2016లో విడాకులు తీసుకొని విడిపోయారు.
undefined
click me!