గ్రీన్ అవుట్ ఫిట్ లో ప్రణీతా సుభాష్ స్టన్నింగ్ లుక్.. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తున్న బుట్టబొమ్మ

First Published | Jun 9, 2023, 1:33 PM IST

గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhas) రోజురోు అందంగా మెరుస్తూనే అదిరిపోయే అవుట్ ఫిట్లలో మతులు పోగొడుతోంది. తాజాగా టైట్ ఫిట్ లో మెరుపులు మెరిపించింది. పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.   
 

తెలుగు ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసిన కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్. తెలుగులో తక్కువ సినిమాలే చేసిన తన నటన, గ్లామర్ తో మాత్రం ఆడియెన్స్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన కేరీర్ ను కన్నడలో ప్రారంభించి ప్రస్తుతం సౌత్ లో అన్ని భాషల్లో నటిస్తోంది. 
 

తెలుగులో ప్రణీత సుభాష్ సినిమాలు చేయక దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ‘హాలో గురు ప్రేమ కోసమే’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో చివరిగా నటించింది. ఆ తర్వాత హిందీలో రెండు సినిమాల్లో నటించి పెళ్లి పీటలు ఎక్కిందీ ముద్దుగుమ్మ. 
 


2021లో మొదటి లాక్ డౌన్ సమయంలోనే వ్యాపార వేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం జరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. ఇక గతేడాది ప్రణీత పండంటి ఆడబిడ్డకు  కూడా జన్మనిచ్చింది. 
 

పెళ్లి తర్వాత కూడా ప్రణీత కెరీర్ లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం సినిమా ఆఫర్ల కెోసం ప్రయత్నిస్తోంది. ఇందుకు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. 
 

తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ప్రణీతా సుభాష్ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో దర్శనమిచ్చింది. నిలువెత్తు నాట్య మయూరిలా కట్టిపడేసింది. మరోవైపు వన్ షోల్డర్ గ్లామర్ తో మంత్రముగ్ధులను చేసింది. టైటిల్ ఫిట్ లో ఫర్ఫెక్ట్ లుక్ ను సొంతం చేసుకుని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘రమణ అవతార’ చిత్రంలో నటిస్తోంది. అలాగే మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ  తొలిచిత్రంగా సూపర్ స్టార్ దిలీప్ 148వ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇక తెలుగులో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 
 

Latest Videos

click me!