
సినిమాల్లో సాంప్రదాయ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తుంది నటి ప్రగతి(Pragathi). హీరోకి తల్లిగానే, అత్తగానో, లేక ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో మెప్పిస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో ప్రగతి కచ్చితంగా ఉండాల్సిందే అనేట్టుగా టాలీవుడ్‌లో పేరుతెచ్చుకుంది ప్రగతి. తనదైన స్టయిల్‌లో తన పాత్రలను రక్తికట్టిస్తూ ఆడియెన్స్ ని అలరిస్తుంది. నటన పరంగానే కాదు, కామెడీ చేయడంలోనూ ప్రగతి స్టయిలే వేరు.
వెండితెరపై ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకునే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది Actress Pragathi. అసలు ప్రగతినేనా ఇలా కనిపించేది అనేంతగా మారిపోయి షాకిస్తుంటుంది. ఎక్కువగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంది ప్రగతి.
వర్కౌట్ డ్రెస్‌లో బిగువైన అందాలతో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. అంతేకాదు కఠినమైన వర్కౌట్ చేస్తూ ఆకట్టుకుంటుంది.ఈ అమ్మడి వర్కౌట్ పోజులు చూస్తుంటే మతిపోతుంది. చూడ్డానికి రెండు కళ్లు చాలనంతగా ఆమె జిమ్‌లో వ్యాయామాలు చేస్తుంటుంది. అంతటితో ఆగదు ప్రగతి. ఆయా వర్కౌట్ పోజులను ఫోటోల రూపంలో బంధించి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటుంది. అవి సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుంటాయి.
తాజాగా ప్రగతి మరోసారి వర్కౌట్ పోజులతో ఇంటర్నెట్‌ని ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. డిఫరెంట్ వర్కౌట్ లుక్‌లో పోజులిచ్చి మైండ్ బ్లాంక్ చేస్తుంది. కండలు తిరిగిన దేహంతో, బాడీ బిల్డర్‌ని తలపించేలా ఉంది ప్రగతి. ఈ అమ్మడిని ఇలా చూస్తూ కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రగతి చేసే రచ్చకి బెంబెలెత్తిపోతున్నారు. ఇంతటి హాట్‌నెస్ తట్టుకోవడం మా వల్ల కాదంటున్నారు.
ఇందులో ప్రగతి చాలా కఠినమైన వ్యాయామాలు చేస్తూ కనిపించడం విశేషం. ట్రైనర్ సమక్షంలో చెమటోడుస్తుంది. హాట్ భంగిమల్లో ఆమె చేసే వర్కౌట్ నెటిజన్లని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వెండితెరపై ఆంటీగా కనిపించే ప్రగతిలోని ఇంతటి హాట్‌నెస్‌ని చూసి షాక్ అవుతున్నారు ఇంటర్నెట్ అభిమానులు. ప్రగతి ఫిట్‌నెస్ కి ఫిదా అయిపోతున్నారు.
ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. అలాగే ఎక్కువగా జిమ్ వీడియో, వర్కౌట్ ఫోటోలను, డాన్సు వీడియోలను షేర్ చేస్తుంది. అత్యంత హాట్ గానూ ఉన్న ఫోటోలను సైతం షేర్ చేసుకుంటూ తన ఫాలోవర్స్ ని ఖుషీ చేస్తుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అలా ఇప్పుడు పంచుకున్న లేటెస్ట్ హాట్ జిమ్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ప్రగతి పెట్టిన పోస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇందులో ఆమె `ఏం జరిగినా మీరు మళ్లీ ప్రారంభించవచ్చు` అంటూ ఇదొక ఉదాహరణగా చెప్పింది ప్రగతి. మీకు విల్ పవర్ ని కనిపెట్టడం కాదు, మీరు ఆ శక్తిని సృష్టించుకోవాలి` అని ఇన్‌స్పైరింగ్ వర్డ్స్ ని షేర్ చేసుకుంది ప్రగతి. ఈ సందర్భంగా తనని ఇంతటి సహజంగా ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్‌కి ధన్యవాదాలు తెలిపింది.
ప్రగతి నటి మాత్రమే కాదు, ఆమె సోషల్ మీడియాలో మోటివేషనల్ పర్సన్ కూడా. తన జిమ్ ఫోటోలు, వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ మహిళలకు సంబంధించి అనేక ఇన్‌స్పైరింగ్ వర్డ్స్ ని చెబుతుంది. ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలి, బాడీతోపాటు మనసు కూడా బలంగా ఉండేందుకు చేయాల్సి విషయాలను కూడా చెబుతుంది. ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఎంతో మంది నటీమణులకు, మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది ప్రగతి.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 130 చిత్రాల వరకూ చేశారు. ప్రగతి సీరియల్ నటిగా కూడా సత్తా చాటారు. 1998లో బుల్లితెరపై ప్రసారమైన తీర్పు, శ్రీ, 1999 అమ్మ వంటి సక్సెస్ ఫుల్ సీరియల్స్ లో నటించారు. ఆమె నటించిన లేటెస్ట్ సీరియల్ మమతల కోవెల జెమినీలో ప్రసారమైంది.
ప్రగతి హీరోయిన్ గా కూడా చేశారన్న విషయం చాలా మందికి తెలియదు. 1994లో విడుదలైన 'వీట్ల విశేషంగ' మూవీతో ప్రగతి హీరోయిన్ గా మారారు. ఆ సినిమాలో హీరోగా భాగ్యరాజ్ నటించడంతోపాటు దర్శకత్వం వహించారు. అదే ఏడాది విజయ్ కాంత్ కి జంటగా 'పెరియ మరుదు' అనే మరో మూవీలో నటించారు. ప్రారంభంలో హీరోయిన్‌గా మంచి పేరుతెచ్చుకుంది ప్రగతి. 1997వరకు ప్రగతి హీరోయిన్ గా మరో మూడు తమిళ్, ఒక మలయాళ చిత్రంలో నటించారు.
పెళ్లి చేసుకున్నాక ఆమె హీరోయిన్‌గా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సీరియల్స్ వైపు మొగ్గు చూపారు. అలా 1998లో ప్రసారమైన `తీర్పు, `అమ్మ` సీరియల్స్ తో కమ్ బ్యాక్ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ `బాబీ` సినిమాతో ప్రారంభమైంది. ఇటీవల కాలంలో ప్రతి సినిమాలోనూ ప్రగతి కనిపిస్తుంది. ముఖ్యంగా `ఎఫ్ 2` సినిమాలో ఆమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. ఇప్పుడు `ఎఫ్3`తో మరోసారి అలరించేందుకు వస్తుంది. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది.