Pragathi: తోడు కావాలనిపిస్తుంది కానీ, ఈ వయసులో అదే అడ్డు... సెకండ్ మ్యారేజ్ పై ప్రగతి కామెంట్స్!

Published : Jan 03, 2023, 03:03 PM ISTUpdated : Jan 03, 2023, 03:11 PM IST

నటి ప్రగతి రెండో వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోడు కావాలని కోరుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.   

PREV
16
Pragathi: తోడు కావాలనిపిస్తుంది కానీ, ఈ వయసులో అదే అడ్డు... సెకండ్ మ్యారేజ్ పై ప్రగతి కామెంట్స్!
Pragathi


వెండితెర మదర్ గా ప్రగతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇరవై ఏళ్లుగా ప్రగతి తల్లి పాత్రలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాక ఆమె పేరు తరచుగా వార్తలకు ఎక్కుతుంది. ప్రగతి వయసుతో సంబంధం లేకుండా హెవీ వర్క్ అవుట్స్ చేస్తారు. డాన్స్ వీడియోలు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. ఈ వీడియోలను కొందరు ట్రోల్ చేస్తారు కూడా. అయినా అవేమీ ప్రగతి పట్టించుకోరు. 

26
Pragathi


ప్రగతి ప్రస్తుతం సింగిల్ మదర్. ఆమె చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయారు. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం తప్పుడు నిర్ణయంగా ప్రగతి బాధపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి... ఆవేశం, ఇగో, నేను ఏదైనా చేయగలను అనే మొండితనం వలన తక్కువ ఏజ్ లో వివాహం చేసుకున్నారు. ఆ నిర్ణయం నా లైఫ్ పై ప్రతికూల ప్రభావం చూపింది. 
 

36
Pragathi

ఒక తప్పుడు నిర్ణయం వలన ఏర్పడిన పరిస్థితుల నుండి బయటకు రావడం కూడా కష్టమే. హీరోయిన్ గా ఎదిగే రోజుల్లో నేను పెళ్లి చేసుకున్నాను. దాని వలన చాలా నష్టపోయాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పై పెట్టిన ఫోకస్ హీరోయిన్ గా ఉన్నపుడు పెడితే నా లైఫ్ వేరుగా ఉండేదని, ప్రతి బాధపడ్డారు. 
 

46

మరి రెండో పెళ్లి ఆలోచన ఉందా? అని అడగ్గా... పెళ్లి అనడం కంటే తోడు అనుకోవచ్చు. ఒక్కోసారి తోడు కావాలి అనిపిస్తుంది. అయితే నా మెచ్యూరిటీకి మ్యాచ్ అయ్యే వ్యక్తి దొరకాలి. కొన్ని విషయాల్లో నేను చాలా కచ్చితంగా ఉంటాను. 20 ఏళ్ల వయసులో ఉంటే అడ్జస్ట్ అయ్యేదాన్నేమో కానీ... ఇప్పుడు కష్టం, అని ప్రగతి అన్నారు.

56


ఈ వయసులో పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అయి బ్రతకడం కష్టం, ఇక పెళ్లి చేసుకోనని పరోక్షంగా ప్రగతి చెప్పారు. ప్రగతి కూతురితో పాటు ఒంటరిగా ఉంటున్నారు. ఆమె డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె కంటూ మంచి సంపాదన ఉంది. 
 

66

1994లో హీరోయిన్ గా ప్రగతి కెరీర్ మొదలైంది. 1997 వరకు తమిళ, మలయాళ చిత్రాల్లో లీడింగ్ రోల్స్ చేశారు. ఆ సమయంలోనే ప్రగతి వివాహం చేసుకుని పరిశ్రమకు దూరం అయ్యారు. 2002లో రీఎంట్రీ ఇచ్చారు. బాబీ మూవీలో చిన్న వయసులోనే మహేష్ మదర్ రోల్ చేశారు. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగిపోతుంది.

click me!

Recommended Stories