ఫ్లైయింగ్ కిస్సులు వదిలిన పూనమ్ బజ్వా.. పొట్టి డ్రెస్ లో నాగ్ బ్యూటీ అందాల రచ్చ..

First Published | May 2, 2023, 11:38 AM IST

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) అందాలతో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా పూనమ్ పంచుకున్న వీడియో, పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. గ్లామర్ బ్యూటీ మెరుపులతో మైమరిపిస్తోంది.
 

అందాలను ఆవిష్కరించడంలో రోజుకో తీరును ప్రదర్శిస్తోంది యంగ్ బ్యూటీ పూనమ్ బజ్వా. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.  మరోవైపు గ్లామర్ షోతోనూ మైమరిపిస్తోంది.
 

కొద్దిరోజులుగా పూనమ్ నెట్టింట అందాల రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంతో తాజాగా వెకేషన్ నుంచి ఓ వీడియోను, ఫొటోలను షేర్ చేసుకుంది. పొట్టి డ్రెస్ లో దర్శనమిచ్చిన ముద్దుగుమ్మ బొద్దుగా అందాలను ఆవిష్కరించింది. నెటిజన్ల మతులు పోగొట్టింది.
 


పొట్టి షార్ట్, స్లీవ్ లెస్ టాప్ లో దర్శనమిచ్చింది పూనమ్ బజ్వా. తన అభిమానులకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ మంత్రముగ్ధులను చేసింది. మరోవైపు టాప్ టు బాటమ్ పరువాలను చూపిస్తూ హార్ట్ బీట్ పెంచేసింది. నేచురల్ బ్యూటీతో ఆకట్టుకుంది.  దీంతో ఫ్యాన్స్ లైక్స్ కామెంట్లు పెడుతూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

ఇక యంగ్ బ్యూటీ పూనమ్ బజ్వా గతంలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) సరసన ‘బాస్’ చిత్రంలో నటించింది. చిత్రంలో నయనతారతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన అందంతో కట్టిపడేసింది. 
 
 

ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇలా తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.  అలాగే గ్లామర్ మెరుపులతోనూ మతులు పోగొడుతోంది. అందాలతో దుమారం రేపుతోంది.  
 

కేరీర్ విషయానికొస్తే.. పూనమ్ చేతిలో పెద్దగా ఆఫర్లు లేవని తెలుస్తోంది. తెలుగు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ  తమిళ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఆకట్టుకుంటోంది.  తెలుగులో చివరిగా ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’లో మెరిసింది.

Latest Videos

click me!