కంటెస్టెంట్‌లను టార్చర్‌ పెడతారు.. బిగ్‌ బాస్‌ బ్యాన్‌ చేయాలన్న నటి

First Published | Jul 28, 2020, 5:06 PM IST

అంతర్జాతీయ స్థాయిలో సూపర్ హిట్ అయిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్‌. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ ఈ షో సూపర్‌ హిట్ అయ్యింది. సౌత్‌ లోనూ బిగ్‌ బాస్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సంచనల సృష్టించింది. అయితే తమిళ బిగ్‌ బాస్‌లో పాల్గొన్న ఓవియా షో పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

బిగ్‌ బాస్ అంటేనే కాంట్రవర్సీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. షోలో పాల్గొన బోయే కంటెస్టెంట్‌ల లిస్ట్‌ దగ్గర నుంచి షో మొదలైన తరువాత కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, ఇతర వివాదాలతో బిగ్‌ బాస్‌ ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో గతంలో బిగ్‌ బాస్‌ లో పాల్గొన్న కంటెస్టెంట్‌ల కామెంట్స్‌ కూడా వివాదాస్పదమవుతున్నాయి.
undefined
బిగ్‌ బాస్‌ షోలో పాల్గొన్న చాలా మంది నటీనటులు షో నుంచి బయటకు వచ్చిన తరువాత బిగ్ బాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా బిగ్‌ బాస్‌లో పాల్గొన్న ఓ నటి షో బ్యాన్ చేయాలంటూ సంచలన వ్యాక్యలు చేసింది.
undefined
Tap to resize

కోలీవుడ్‌ మూవీ కలవాని తో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఓవియా హెలెన్‌. దాదాపు 40 సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తమిళ్‌తో పాటు తెలుగు, తమిళ, మళయాల భాషల్లో నటించింది. ఈ బ్యూటీ తమిళ బిగ్ బాస్‌ తొలి సీజన్‌లోనే నటించి మెప్పించింది.
undefined
బిగ్ బాస్ హౌస్‌లో ఆరవ్‌తో హాట్ హాట్‌ రొమాన్స్ చేసిన ఓవియా తరువాత ఆత్మహత్యా ప్రయత్నం చేసిన మరింత పాపులర్ అయ్యింది. షోలో చేసిన రచ్చతో సౌత్‌ తో భారీ క్రేజ్‌ సొంతం చేసుకుంది ఓవియా. ఇప్పుడు ఈ బ్యూటీనే షోని బ్యాన్ చేయాలనటంతో అంతా షాక్ అయ్యారు.
undefined
ఇటీవల ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఓవియా ఈ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి బిగ్‌ బాస్‌ షో నిషేందించాలన్న డిమాండ్‌ పై మీస్పందన ఏంటి అని అడగ్గా.. అవును ఆ షోను నిషేదించాలి అంటూ చెప్పుకొచ్చింది ఓవియా.
undefined
షోలో నిర్వహకులు టీఆర్పీల కోసం కంటెస్టెంట్‌లను టార్చర్‌ పెడతారని, కంటెస్టెంట్‌లు చచ్చినా పరవాలేదు అన్న రేంజ్‌లో ప్రెజర్‌ ఉంటుందని చెప్పింది. అందుకే షోను బ్యాన్‌ చేయటమే కరెక్ట్‌ అని కామెంట్‌ చేసింది ఓవియా.
undefined

Latest Videos

click me!