Actress Hema
టాలీవుడ్ లో నటి హేమ కొన్ని దశాబ్దాల పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, అతడు, జులాయి లాంటి చిత్రాలు హేమకి నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి. అయితే ఇటీవల హేమ డ్రగ్స్, రేవ్ పార్టీ వ్యవహారంలో చిక్కుకుని పోలీసు కేసులు ఎదుర్కొంది. అరెస్ట్ కూడా అయింది.
ప్రస్తుతం ఎలాగోలా ఆ వ్యవహారం నుంచి బయటపడింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హేమని అతడు చిత్రం గురించి ప్రశ్నించారు. ఆ చిత్రంలో హేమ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతమైన హాస్యాన్ని అందించాయి. అలాంటి సినిమాలో ఎప్పుడు నటిస్తారు అని ప్రశ్నించగా.. హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు లాంటి చిత్రమే కాదు ఇకపై ఎలాంటి సినిమాలో కూడా నటించను.
నేను 14 ఏళ్ళ వయసు నుంచి కష్టపడుతున్నా. ఇకపై విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. జీవితాంతం కష్టపడుతూనే ఎందుకు ఉండాలి. అందుకే చిల్ అవుతున్నా. సినిమాలకు, నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. శివగామి లాంటి పాత్ర ఇచ్చినా చేయను అని హేమ తేల్చి చెప్పింది.
ఒకవేళ మళ్ళీ నాకు నటనపై ఆసక్తి కలిగితే అప్పుడు ఆలోచిస్తా అని హేమ తెలిపింది. తాను ఇకపై ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి సినిమాలకు దూరం అవుతున్నట్లు హేమ ప్రకటించింది. కారణం అదేనా ఇంకేమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది. వివాదాల వల్ల కూడా హేమ యాక్టింగ్ కి దూరం అవుతుండొచ్చు అని నెటిజన్లు భావిస్తున్నారు.