‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కు మరో బంపర్ ఆఫర్! రేపే ప్రారంభం? డిటేయిల్స్

First Published | Jun 13, 2023, 2:26 PM IST

క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 
 

బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే ‘సీతారామం’తో చాలా దగ్గరైన విషయం తెలిసిందే. తన బ్యూటీఫుల్ పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. దీంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

ఫలితంగా మృణాల్ కు తెలుగు ఇండస్ట్రీ నుంచి వరుసగా అవకాశాలు అందుతున్నాయి. ఇప్పటికే భారీ ప్రాజెక్టుల్లో ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ సీక్వెల్ కు మృణాల్ ఫైనల్ అయ్యిందని అంటున్నారు. రేపే సినిమా ప్రారంభం కానుందనీ తెలుస్తోంది. 
 


ప్రస్తుతం మృణాల్ తెలుగులో రెండో చిత్రంగా నేచురల్ స్టార్ నాని సరసన Nani30లో నటిస్తోంది. రీసెంట్ గానే ముంబైలో కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం మిగితా షూటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడో సినిమా కూడా ఫైనల్ అయ్యిందంటున్నారు. 
 

తాజా సమాచారం ప్రకారం.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ నటించే ఛాన్స్ దక్కించుకుంది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకోకున్న చిత్రంలో మృణాల్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందని సినీ వర్గాల్లో న్యూస్ వైరల్ గా మారింది.
 

ముందు పూజా హెగ్దేను అనుకున్నా.. చివరికి మృణాల్ ను టీమ్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం జూన్ 14న ప్రారంభం కానుందని అంటున్నారు. స్టార్ డైరెక్టర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారని సమాచారం. ప్యూర్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

ప్రస్తుతం మృణాల్ నాని30వ చిత్రంలో నటిస్తోంది. అలాగే హిందీలోనూ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. మరోవైపు మృణాల్ పేరు రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాలోనూ వినిపిస్తోంది. మరిన్ని ప్రాజెక్ట్ లలో ఛాన్స్ దక్కించే అవకాశం లేకపోలేదు. 
 

Latest Videos

click me!