HBD Anasuya: నేడు అనసూయ బర్త్ డే... ఈ స్టార్ యాంకర్ వయసెంతో తెలుసా? షాక్ అవుతారు! 

Published : May 15, 2023, 02:03 PM IST

స్టార్ యాంకర్ అనసూయ బర్త్ డే నేడు. ఈ క్రమంలో ఆమె వయసుపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.   

PREV
18
HBD Anasuya: నేడు అనసూయ బర్త్ డే... ఈ స్టార్ యాంకర్ వయసెంతో తెలుసా? షాక్ అవుతారు! 

అనసూయ భరద్వాజ్ జన్మదినం నేడు. అభిమానులు, చిత్ర ప్రముఖులు, బుల్లితెర సెలెబ్రిటీలు ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. అనసూయ జన్మదినం నేపథ్యంలో ఆమె వయసు చర్చకు వచ్చింది. ఇంతకీ అనసూయ వయసు ఎంతని నెటిజెన్స్ చర్చలు పెడుతున్నారు. 
 

28

మే 15న 1985లో అనసూయ జన్మించారు. అంటే అనసూయ 38వ ఏట అడుగుపెట్టారు. చెప్పాలంటే ఆమె నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతున్నారు. అనసూయకు ఇంత వయసంటే నమ్మడం కష్టమే. గ్లామర్ ఫీల్డ్ లో ఉంటున్న నేపథ్యంలో కఠిన కసరత్తులు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ అనసూయ యంగ్ అండ్ ఫిట్ బాడీ మైంటైన్ చేస్తుంది. 
 

38

ఇంత అందంగా ఉన్నా అనసూయను ప్రత్యర్ధులు ఆంటీ అని ట్రోల్ చేస్తుంటారు. దానికి కారణం ఆమె వివాహిత కావడమే. అనసూయ చాలా కాలం క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి వయసు పదేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో అనసూయ అమ్మాయి కాదు ఆంటీ అని ట్రోల్ చేస్తుంటారు. 
 

48

అనసూయ స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడింది. లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్నట్లు సుశాంక్ భరద్వాజ్ ఆమెకు పిచ్చపిచ్చగా నచ్చేశాడు. టీనేజ్ లో మొదలైన ఆ లవ్ ఏళ్ల తరబడి సాగింది. సుశాంక్ తో పెళ్ళికి అనసూయ తండ్రి ఒప్పుకోలేదు. దాంతో ఆమె ఇంటిని బయటకు వచ్చేసి హాస్టల్ లో మకాం పెట్టింది. చివరకు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది. 

58


మొదట్లో నటిగా ప్రయత్నాలు చేసింది. సక్సెస్ దక్కలేదు. న్యూస్ రీడర్, కార్పొరేట్ కంపెనీలో హెచ్ ఆర్ గా కూడా బాధ్యతలు నెరవేర్చారు. జబర్దస్త్ ఆమె దశ మార్చేసింది. 2013లో మొదలైన జబర్దస్త్ కామెడీ షో సక్సెస్ కావడంతో అనసూయకు పాపులారిటీ వచ్చింది. బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. 

68


ఆ ఇమేజ్ నటిగా మారేందుకు ఉపయోగపడింది. వెండితెర మీద వరుస ఆఫర్స్ పట్టేస్తూ అనసూయ దూసుకుపోతుంది. ఆమెకు లీడ్ రోల్స్ కూడా రావడం విశేషం. రంగస్థలం మూవీ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ పుష్ప లో ఆమెకు మరో క్రేజీ రోల్ ఆఫర్ చేశారు. పుష్ప 2లో సైతం అనసూయ సందడి చేయనుంది. 

78


నటిగా బిజీ అయ్యాక యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది. బుల్లితెర దూరమయ్యాక షోల మీద ఆరోపణలు చేశారు. టీఆర్పీ కోసం మేకర్స్ చెత్త ట్రిక్స్ ప్లే చేస్తున్నారని అన్నారు. జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడినట్లు ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 
 

88

కెరీర్ సక్సెస్ఫుల్ ట్రాక్ లో పరిగెడుతుండగా కొన్ని వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. విజయ్ దేవరకొండతో ఆమెకు కోల్డ్ వార్ నడుస్తుంది. పలుమార్లు విజయ్ దేవరకొండ మీద ఆమె పరోక్షంగా సెటైర్స్ వేశారు. దాంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాను అనసూయను ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటూ అనసూయ ముందుకు పోతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories