ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. నువ్వూ ఆ మెటీరియలే అంటున్న ఫ్యాన్స్

First Published | May 18, 2023, 7:36 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ హారిక (Bigg Boss Harika) బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చింది. ట్రెడిషనల్ వేర్స్ లో పద్ధతిగా మెరిసి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
 

తెలంగాణ యాస, భాష బాగా తెలిసిన బ్యూటీ హారిక. యూట్యూబర్ గా కేరీర్ ను ప్రారంభించింది. ‘దేత్తడి’ ఛానెల్ లో యూత్ లో యమా క్రేజ్ దక్కించుకుంది. యంగ్ బ్యూటీ మాటలు, డైలాగ్స్, నటనకు యూట్యూబ్ యూజర్లు ఫుల్ ఫిదా అయ్యారు. దీంతో హారికకు మస్త్ ఫాలోయింగ్ పెరిగింది.
 

ఆ క్రేజ్ తోనే పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో అవకాశం అందుకుంది. నాలుగో సీజన్ లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనదైన శైలిలో ప్రతిటాస్క్ లో చురుకుగా పాల్గొంటూ సందడి చేసింది. బుల్లితెర ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. 


బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక హారికకు మరింత క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో టీవీ షోల్లోనూ సందడి చేసింది. కానీ కంటిన్యూ కాలేకపోయింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన క్రేజ్ ను సరిగా వాడుకోలేకపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఫోకస్ పెట్టాలని అంటున్నారు. 
 

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ట్రెడిషనల్ డ్రెస్ లో మెరిసింది. చుడీదార్ లో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. బ్యూటీఫుల్ లుక్ లో కట్టిపడేసింది. క్యూట్ స్మైల్, మత్తెక్కించే కళ్లతో హారిక కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. తాజాగా ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.
 

అభిమానులతో ఈ ఫొటోలను పంచుకోవడంతో లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. క్రేజీగా కామెంట్లు సైతం పెడుతున్నారు. ‘నువ్వు కూడా హీరోయిన్ మెటీరియలే’ అంటూ ఆమెను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు ఆమె బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

బిగ్ బాస్ తర్వాత హారిక పలు ఇంటర్వ్యూలు, పలు మాల్స్ ఓపెనింగ్స్ కు గెస్ట్ గా వెళ్తూ ఉంది. అయితే తాజాగా ‘వెళ్లకే’ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. ఇప్పటికే సాంగ్ విడుదలైంది. తర్వలో వీడియో సాంగ్ కూడా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బ్యూటీపుల్ లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. 

Latest Videos

click me!