కృతి శెట్టి..`ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాస్ బస్టర్ హిట్‌ని అందుకుంది. ఓ రకంగా `బోర్న్ విత్ స్టార్` అనే ట్యాగ్‌లైన్‌కి న్యాయం చేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు`, `ది వారియర్స్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, ఇటీవల `కస్టడీ` సినిమాలతో మెరిసింది. `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` ఫర్వాలేదనిపించాయి. కానీ మిగిలిన నాలుగు సినిమాలు బోల్తా కొట్టాయి. ఇప్పుడు మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. తెలుగులో కొత్తగా ఇంకా ఏదీ కన్ఫమ్ కాలేదు.