జిమ్ వేర్ లో జీరో నడుముతో కేక పెట్టిస్తున్న మాళవిక మోహన్.. ఫిట్నెస్ కోసం మలయాళీ భామ వర్కౌట్స్..

First Published | Apr 21, 2023, 6:59 PM IST

తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. 
 

మలయాళ భామ మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుంటారో తెలిసిందే. యంగ్ బ్యూటీ క్రేజీ  పోస్టులు పెడుతూ.. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది మాళవిక.
 

అయితే, ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎంతటి పోటీ ఉందో తెలిసిందే. ముఖ్యంగా యంగ్ హీరోయిన్లను దర్శకనిర్మాతలు తమ ప్రాజెక్ట్స్ కోసం పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లు కూడా తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. గ్లామర్ మెయిటేన్ చేస్తూనే.. ఫిట్ నెస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. 
 


ఇందుకోసం యంగ్ బ్యూటీలు జిమ్ సెంటర్లలో గంటల తరబడి వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది.  జీరో ఫ్యాట్ బాడీ కోసం, ఫిట్ నెస్ తో కసరత్తులు చేయకతప్పదు. ఇక తాజాగా మాళవిక మోహనన్ కూడా మరింత నాజూగ్గ తయారయ్యేందుకు జిమ్ లో వర్కౌట్లు చేస్తోంది. 
 

తాజాగా తను జిమ్ లో చేసిన వర్కౌట్స్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. టైట్ బ్లాక్ జిమ్ వేర్ లో దర్శనమిచ్చింది. జిమ్ లో బార్ హ్యాంగ్ అవుతూ.. డంబెల్స్ ను మోస్తూ కనిపించింది. ఈ ఫొటోలను షేర్ చేసుకుంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. 

తను కేవలం జిమ్ లో వేళాడుతూనే ఉంటానని చెప్పుకొచ్చింది. ఎల్లప్పుడూ పని చేయడం లేదా వర్కౌట్ చేయడానికే సమయం కేటాయిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మాళవిక శ్రమను చూసిన అభిమానులు పొగుడుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

మాళవికా పంచుకున్న ఫొటోలను యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ లైక్ చేసింది. ఇక నెటిజన్లు లైక్స్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన ‘తంగలన్’లో మాళవికా నటిస్తోంది. అటు హిందీలో ‘యుద్ర’లోనూ మెరియనుంది. ఇక టాలీవుడ్ లో ప్రభాస్ - మారుతీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
 

Latest Videos

click me!