లెహంగా వోణీలో త్రిష మెరుపులు.. కుర్ర భామలా పోజులిస్తూ.. కొంటె చూపులతో మత్తెక్కిస్తున్న స్టార్ హీరోయిన్

First Published | Apr 21, 2023, 6:01 PM IST

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్  (Trisha Krishnan) ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఈవెంట్లకు, ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తోంది. 
 

స్టార్ హీరోయిన్, సీనియర్ నటి త్రిష కృష్ణన్  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో సీనియర్లందరి సరసన నటించింది. ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. చాలా కాలం  తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో త్రిష హవా మొదలైంది. దీంతో తెగ సందడి చేస్తోంది. 
 

తమిళ బాహుబలిగా వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.  చిత్రంలో త్రిష, ఐశ్వరాయ్, శోభితా హీరోయిన్లుగా నటించగా.. విక్రమ్, కార్తీ, జయంరవి ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ చిత్రంతో త్రిషకు ‘కుందవై’గా మంచి గుర్తింపు దక్కింది.
 


ప్రస్తుతం ఏప్రిల్ 28న Ponninyin Selvan 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వారంలో రిలీజ్ కాబోతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. త్రిష కూడా సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. 
 

మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తున్న త్రిష తన  లేటెస్ట్ లుక్ ను అభిమానులతో పంచుకున్నారు.  ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో త్రిష పాల్గొన్నారు. రెడ్ లెహంగా, వోణీలో ట్రెడిషనల్ లుక్ తో మైమరిపించింది. సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతూ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది.
 

స్టార్ హీరోయిన్ త్రిష నాలుగు పదుల వయస్సుకు మరీ దగ్గరగా ఉంది. అయినా  కుర్ర భామలా లెహంగా వోణీలో యంగ్ బ్యూటీ దర్శనమిస్తుండటం ఫ్యాన్స్ ను ఖుషీ  చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో త్రిష గ్లామర్ మెరుపులకు అభిమానులతో పాటు ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. సీనియర్ భామ మత్తు చూపులకు మైమరిచిపోతున్నారు. 
 

త్రిష బ్యూటీఫుల్ లుక్ ను అభిమానులతో పంచుకోవడంతో ఫిదా అవుతున్నారు. సీనియర్ నటి మత్తు చూపులు, గ్లామర్ మెరుపులకు మైకంలో తేలుతున్నారు. లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం  ‘పొన్నియిన్ సెల్వన్ 2’తో పాటు లోకేష్ కనగరాజ్ - విజయ్ దళపతి కాంబోలోని LEOలోనూ నటిస్తోంది. 

Latest Videos

click me!