నటి కస్తూరి శంకర్ పేరు చెప్పగానే అన్నమయ్య, భారతీయుడు లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో కస్తూరి శంకర్ తెలుగు తమిళ భాషల్లో హోమ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే, గ్లామర్ పాత్రల్లో కూడా నటించారు. నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కస్తూరి అవకాశం ఉన్నప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో కస్తూరి బుల్లితెరపై సూపర్ క్రేజ్ పొందారు.