కాజల్ అగర్వాల్ ట్రెండీ లుక్ అదుర్స్.. స్టార్ హీరోయిన్ మత్తు చూపులకు మతులు పోవాల్సిందే.. పిక్స్ వైరల్..

First Published | Mar 18, 2023, 5:06 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింటిని షేక్ చేస్తున్నారు. సీనియర్ బ్యూటీ నయా లుక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

టాలీవుడ్ ను కొన్నేండ్లు హీరోయిన్ గా ఊపూపిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా వరుస చిత్రాలకు సైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన సినిమా విషయాలను పంచుకోవడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. 
 

వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో 2020 అక్టోబర్ 30న ముంబైలో  కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. గతేడాది 2022 ఏప్రిల్ 19న మగబిడ్డకూ జన్మనిచ్చింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా కాస్తా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది.
 


ఇకపై నుంచి కాజల్ అగర్వాల్ చేయబోయే పాత్రలు చాలా కొత్తగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో నటించిన ‘ఘోస్టీ’తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ‘ఉగాది’కి ఈ చిత్రం రిలీజ్ కానుంది.   ప్రమోషన్స్ లో భాగంగా నెట్టింట తెగ సందడి చేస్తోంది. 
 

ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా ట్రెండీ వేర్స్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ఎల్లో ప్రింటెడ్ షర్ట్ లో, బ్లూ బాగీ టైమ్ జీన్స్ లో స్టైలిష్ గా మెరిసింది. ఈ క్రమంలో ఫొటోలకు మతిపోయేలా ఫోజులిచ్చింది.
 

మత్తు చూపులు, మత్తెక్కించే పోజులతో సీనియర్ హీరోయిన్ అభిమానులను ఫిదా చేసింది. చెక్కుచెదరని అందంతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేంది. దీంతో ఫ్యాన్స్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టార్ హీరోయిన్  ప్రస్తుతం  భారీ చిత్రాల్లో నటిస్తోంది. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, బాలయ్య ‘ఎన్బీకే 108’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయా చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఈక్రమంలో కాజల్ అప్ కమింగ్ ఫిల్మ్స్ పై ఆసక్తి నెలకొంది. 
 

Latest Videos

click me!