ఆయన కదా అని పిలిస్తే వెళ్ళా, చీర విప్పి పడుకోమన్నాడు.. డైరెక్టర్ పై నటి జ్యోతి షాకింగ్ కామెంట్స్

Published : Jun 13, 2023, 05:51 PM IST

చిత్ర పరిశ్రమలో నటీమణులకు చెప్పుకోలేని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వారికి ఎదురైనా సమస్యలని బయటకి చెబితే మరోసారి అవకాశాలు ఇవ్వరేమోనని చాలా మంది నటీమణులు భయపడుతుంటారు. అయితే ఎలాంటి విషయాల గురించి అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నటి జ్యోతి స్టైల్.

PREV
18
ఆయన కదా అని పిలిస్తే వెళ్ళా, చీర విప్పి పడుకోమన్నాడు.. డైరెక్టర్ పై నటి జ్యోతి షాకింగ్ కామెంట్స్

చిత్ర పరిశ్రమలో నటీమణులకు చెప్పుకోలేని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వారికి ఎదురైనా సమస్యలని బయటకి చెబితే మరోసారి అవకాశాలు ఇవ్వరేమోనని చాలా మంది నటీమణులు భయపడుతుంటారు. అయితే ఎలాంటి విషయాల గురించి అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నటి జ్యోతి స్టైల్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రొమాంటిక్ కామెడీ పాత్రలతో నటి జ్యోతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

28

జ్యోతి వ్యాంప్ తరహా పాత్రలు కూడా చేసింది. ఆమె ఎలాంటి వ్యాంప్ రోల్ చేసినా అందులో కాస్త కామెడీ టచ్ ఉంటుంది. దీనితో నటి జ్యోతికి మంచి గుర్తింపు దక్కింది. అయితే ఇటీవల నటి జ్యోతికి కాస్త అవకాశాలుతగ్గాయనే చెప్పాలి. తాజాగా నటి జ్యోతి ఓ ఇంటర్వ్యూలో దివంగత సీనియర్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

38

వ్యాంప్ రోల్స్ చేస్తున్నాను కాబట్టి ఎలా పడితే అలా ఇబ్బందికర పరిస్థితుల్లో నటించడం నా వల్ల కాదు. నాకు ఇబ్బందిగా అనిపిస్తే ఎంతటివారైనా నిర్మొహమాటంగా చెప్పేస్తా అని జ్యోతి తెలిపింది. స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గురించి నటి జ్యోతి బాంబు పేల్చుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

 

48

ఈవీవీ గారు నాకు తొట్టి గ్యాంగ్ లో అవకాశం ఇచ్చారు. సాధారణంగా ఈవీవీ గారు నటీనటులకు కథ చెప్పరు. ఈ విధంగా క్యారెక్టర్ ఫిక్స్ చేశాం. షూటింగ్ కి వచ్చేయండి అని చెబుతారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఏ యాక్టర్, యాక్ట్రెస్ అలా చెబితే ఒప్పుకోరు. కథ వినాల్సిందే. ఈ ఈవీవీగారు నాకు మరోసారి ఎవడిగోల వాడిదిలో మంచి రోల్ ఇచ్చారు. 

 

58

'సమర్పించేసుకుంటాను' అంటూ నేను ఫన్నీగా చెప్పిన డైలాగ్ నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ రోల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఆ చిత్రంలో తెలంగాణ శకుంతల కూడా నటించారు. ఆమెకి కూడా ఈవీవీ గారు పాత్ర ఏంటో చెప్పలేదు. కానీ కృష్ణ భగవాన్ గారితో ఆమెకి ఒక కామెడీ బెడ్ సీన్ ఉంది. అది చేయడానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. 

 

68

షూటింగ్ మధ్యలో నేను చేయలేను అని ఎలా వెళ్ళిపోతారు. దీనితో ఆమె నేనెప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదు.. అంటూ మధనపడుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక నా విషయానికి వస్తే కితకితలులో కూడా నాకు ఈవీవీ గారు ఛాన్స్ ఇచ్చారు. పాత్ర ఏంటో చెప్పలేదు. రేపు షూటింగ్ ఉంది.. మార్నింగ్ వచ్చేయ్ అని పిలిచారు. ఈవీవీ గారు పిలవడంతో ఎవడిగోల వాడిది తరహాలో మంచి పాత్ర అయి ఉంటుంది.. బాగా చేసి డైరెక్టర్ ని ఇంప్రెస్ చేయాలని ఫుల్ ఎనెర్జీతో సెట్స్ కి వెళ్లా. 

 

78

నా అది వ్యాంప్ రోల్. సెట్ మొత్తంగా రెడీగా ఉంది. నేను వెళ్ళగానే శారీ కాస్ట్యూమ్ ఇచ్చారు. షాట్ కి రెడీ అయితే.. ఈవీవీ గారు చీర విప్పి అక్కడ పడుకో అని అన్నారు. కొంగు తీసేసి నటించాలి అన్నారు. సెట్ లో చాలా మంది ఉన్నారు. నాకు చాలా ఇబ్బందిగా బాధగా అనిపించింది. నాకు ఆ పాత్ర ఏమాత్రం నచ్చలేదు. ఏదో పెద్ద డైరెక్టర్ పిలిచారు కదా.. సైలెంట్ గా చేసేద్దాం అని సద్దుకుపోయే క్యారెక్టర్ కాదు నాది. 

 

88

పాత్ర ఏంటో ముందే చెప్పకుండా సెట్ కి పిలిచి అవమానించడం కరెక్ట్ కాదు. దీనితో నాకు ఇబ్బందిగా ఉంది సర్.. ఈ సీన్ మార్చండి నేను చేస్తా అని చెప్పా. నాకే ఎదురుచెప్తావా.. నేను చెబితే చేయవా అని తిట్టడం ప్రారంభించారు. నేను చేయను అని తేల్చి చెప్పేశా. వెంటనే మేకప్ రూమ్ కి వెళ్ళా. ఇక్కడే ఉంటే ఎలాగోలా కన్విన్స్ చేయించి నాతో ఈ రోల్ చేయిస్తారు అని అనుకున్నా. వెంటనే సెట్స్ నుంచి వెళ్ళిపోయా. ఇక అంటే అప్పటి నుంచి ఈవీవీ సినిమాల్లో నేను నటించలేదు అని జ్యోతి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

click me!

Recommended Stories