మేకప్ లేకుండా షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. ఫిట్ నెస్ కోసం జాక్వెలిన్ కఠిన ఆసనాలు.. పిక్స్ వైరల్

First Published | Mar 20, 2023, 6:32 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్  (Jacqueline Fernandez) తాజాగా నోమేకప్ ఫొటోలను పంచుకుని అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దక్షిణాది ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. తొలుత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘సాహో’ చిత్రంలో గ్లామర్ స్టెప్పులు లేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జాక్వెలిన్ కు తెలుగులోనూ మంచి గుర్తింపు ఏర్పడింది. 
 

గతేడాది వచ్చిన బ్లాక్ బాస్టర్ సాంగ్ ‘రా రా రక్కమ్మ’ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో.. జాక్వెలిన్ డాన్స్ కూడా ప్రేక్షకులకు అంతగానే గుర్తుండిపోయింది. దీంతో సౌత్ ఆడియెన్స్ లో జాక్వెలిన్ కు మంచి క్రేజ్ దక్కింది.
 


దక్షిణాది చిత్రాల్లో ఎక్కువగా జాక్వెలిన్ నటించకున్నా..  స్పెషల్ అపియరెన్స్ తో అదరగొడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గ్లామర్ మెరుపులతో పాటు తన ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది. 
 

ఇక తాజాగా జాక్వెలిన్ మేకప్ లేకుండా సెల్ఫీ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. మేకప్ లేకున్నా.. నేచురల్ బ్యూటీతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. మెరిసిపోయే అందంతో ఆకట్టుకుంది. 
 

అయితే తను పంచుకున్న ఫొటోలపై ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. మేకప్ లేకున్నా చాలా బ్యూటీఫుల్ గా ఉన్నావంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతుంటే. ఏదేమైనా జాక్వెలిన్ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

అదేవిధంగా కఠిన ఆసనాలు వేస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుండంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక జాక్వెలిన్ కేరీర్ విషయానికొస్తే.. బ్యాక్ టు బ్యాక్ హిందీచిత్రాలతో అలరిస్తూనే ఉంది. రీసెంట్ గా ‘సెల్ఫీ’ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం క్రాక్, ఫతే చిత్రాల్లో నటిస్తోంది.  
 

Latest Videos

click me!