సంప్రదాయ దుస్తుల్లో ‘స్పై’ బ్యూటీ గ్లామర్ మెరుపులు.. మత్తు ఫోజులతో మైమరిపిస్తున్న ఐశ్వర్య మీనన్

First Published | Jul 10, 2023, 7:06 PM IST

తెలుగు ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లకు అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘స్పై’ చిత్రంతో తమిళ బ్యూటీ ఐశ్వర మీనన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ స్పీడ్ చూస్తుంటే ఇక్కడే సెటిల్ అయ్యేలా కనిపిస్తోంది. 
 

తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon)  తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను ‘స్పై’ చిత్రంతో అలరించింది. సాలిడ్ రోల్ లో మెప్పించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం ఆడియెన్స్  నుంచి మంచి మార్కులే పడ్డాయి. 
 

ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలోకి చాలా మంది యంగ్ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్లు కూడా అందుకుంటున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ లో కొన్నేళ్ల పాటు సందడి చేసిన ఐశ్వర్య మీనన్ ఇక టాలీవుడ్ లోనే సందడి చేయబోతోంది. 


రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మకు మరో బంపర్ ఆఫర్ అందినట్టు తెలుస్తోంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చినట్టు టాక్ నడుస్తోంది. భారీ యాక్షన్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 

అయితే, ఇప్పటికే ‘స్పై’లో యాక్షన్ తో అదరగొట్టిన ఐశ్వర్య ‘ఓజీ’లో ఇంకెలాంటి పెర్ఫామెన్స్ ఇవ్వబోతోందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐశ్వర్య మీనన్ రోల్ పై ఇంకా క్లారిటీ రావాల్సి  ఉంది. ఇదిలా ఉంటే.. ఐశ్వర్య మాత్రం తన ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ వస్తోంది. ట్రెడిషనల్ వేర్స్ లోనే దర్శనమిస్తూ కట్టిపడేస్తోంది. మరింత అందంగా కనిపిస్తూనే.. మరోవైపు గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. హెవీ ఎంబ్రాయిడింగ్ గల లెహంగా, వోణీ ధరించి రెట్టింపు అందాన్ని సొంతం చేసుకుంది. అదిరిపోయే ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. దీంతో ఫ్యాన్స్  కూడా లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!