తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రేమ గుడ్డిది అని పెద్దలు ఊరికే చెప్పలేదని, ప్రేమ విషయంలో మాత్రం ఎదుట ఉన్నవాడు తప్పుడు మనిషి, నన్ను బాగా వాడుకుంటున్నాడు, వీడు నన్ను నడిరోడ్డుపై నిలబెట్టి వెళ్లిపోతాడు, వాడి గురించి ఎన్ని రకాలుగా తెలిసినా కూడా, మళ్లీ మళ్లీ ఆ గుహలోనే పడేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది ఇంద్రజ. అలాంటివాళ్లని ఎందుకు ప్రేమిస్తామో తెలియదు, మంచిగా చూసుకుని, రెస్పాన్సిబుల్‌గా ఉన్న వాళ్లపై మనకు ఎందుకు ప్రేమ రాదో తెలియదు, ఎంత ఇబ్బంది పెట్టినా, ఇబ్బంది పడినా, నేను మార్చుకుంటాం. నా ప్రేమ వల్ల మారిపోతాడమనే మూఢనమ్మకం మరోటి లేదని చెప్పింది ఇంద్రజ.