నాగార్జున కోసం `బిగ్‌బాస్‌`కి వెళ్తానంటోన్న ఇంద్రజ.. తమ లవ్‌స్టోరీ సినిమాలా ఉంటుందట..!

First Published Apr 24, 2021, 10:46 AM IST

డబ్బుల కోసం కాదు నాగార్జునని చూసేందుకు `బిగ్‌బాస్‌`కి వెళ్తానంటోంది ఇంద్రజ. అంతేకాదు తమ రియల్‌ లైఫ్‌ ప్రేమ రీల్‌ లైఫ్‌ లవ్‌ స్టోరీని తలపిస్తుందని చెప్పింది. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను చెప్పుకొచ్చింది.

ఇంద్రజ..పేరుకు తగ్గట్టే పైనుంచి దిగొచ్చిన అందాల రాశిలా ఉంటుంది ఇంద్రజ. `యమలీల` చిత్రంతో, అందులోని `నీ జీను ప్యాంటూ చూసి బుల్లెమ్మో` పాటతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది ఇంద్రజ. అందులో అలీతోనే నటించినా, సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఇంద్రజ ఓవర్‌నైట్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
undefined
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ని ఫిదా చేసిన ఇంద్రజ మళ్లీ రీఎంట్రీ ఇచ్చి కెరీర్‌ని ఫుల్‌ స్పీడ్‌లో పరుగులు పెట్టిస్తుంది. ఓ వైపు టీవీ షోస్‌లో మెరుస్తూనే మరోవైపు సినిమాల్లో మంచి రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తిరిగి ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది.
undefined
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఇంద్రజ. తాను ముస్లీంకి చెందిన రచయిత, నటుడు మహ్మద్‌ అబ్సర్ పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయాలను పంచుకుంటూ తమది లవ్‌ మ్యారేజ్‌ అని చెప్పింది ఇంద్రజ.
undefined
తమది బ్రహ్మణ కుటుంబం అని, భర్త ముస్లీం అని వెల్లడించింది. పెళ్లికి ముందు వీరిద్దరు చాలా రోజులు ప్రేమించుకున్నారు. కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన అబ్సర్‌ తో ఆరేళ్లపాటు ఫ్రెండ్‌షిప్‌ చేసిందట. ఈక్రమంలో ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చాయి, ఇద్దరి మనసులను అర్థం చేసుకున్నామని వెల్లడించింది.
undefined
`ఒకరినొకరం ఇష్టపడ్డాం. మతం చూసి, కులం చూసి కాదు, నేను చెప్తే సినిమా డైలాగ్‌లా ఉంటుంది కానీ.. ఇది మాత్రం సినిమా డైలాగ్ కాదు. ఇది నా రియల్ లైఫ్. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. మేం ఇద్దరం ఫ్రెండ్స్‌గా ఆరేళ్లు ఉన్నాం. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని, అర్థం చేసుకున్నాక, అతను నాకు పూర్తిగా సపోర్ట్ గా ఉంటాడనే నమ్మకం కలిగిన తర్వాతే పెళ్లి చేసుకున్నాం.
undefined
ఆయనకు ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయి. ఆయన రచయిత, అలాగే యాడ్‌ ఫిల్మ్ మేకర్‌. ఆయన రాసిన కథని మలయాళంలో దర్శకుడు శ్రీనివాస్ గారు తీసుకున్నారు. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. ఇద్దరం కలిసి సినిమాల గురించి మాట్లాడుకుంటాం, నా సినిమాల్లో ఆయన ఇన్‌వాల్వ్ అవుతుంటారు. కాకపోతే అది లిమిటేషన్‌లోనే ఉంటుంది` అని చెప్పింది. ప్రస్తుతం తాము హ్యాపీగా ఉన్నామని, ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నానంటే ఆయన ప్రోత్సాహమే అని వెల్లడించింది ఇంద్రజ.
undefined
`అదే కాకుండా మాకు ఫ్యామిలీ బిజినెస్ ఉంది. మా మామయ్య వాళ్లకి బిజినెస్ ఉంది. గవర్నమెంట్ ఎక్స్‌పోర్ట్. మా ఆయన వాళ్ల అన్నయ్య.. మా బావగారు కాలిఫోర్నియాలో ఉంటారు. ఆయన సౌత్ ఎషియన్ కంట్రీస్ నుంచి, ఇక్కడ నుంచి మా ఆయన, మావయ్యగారు చూసుకుంటార`ని తెలిపింది.
undefined
అంతేకాదు బిగ్‌బాస్‌ 4 సీజన్‌లో పాల్గొనే అవకాశం ఇంద్రజని వరించిందట. కానీ ఆమె తిరస్కరించినట్టు తెలిపింది. `బిగ్‌బాస్‌4`లో పాల్గొనే ఆఫర్‌ వచ్చింది. కానీ నేను రాలేనని చెప్పాను. ఫ్యామిలీని చెన్నైలో వదిలి.. నేను ఇక్కడ ఉండలేను. అందుకే బిగ్‌బాస్‌లోకి వెళ్లలేదు. భవిష్యత్తులో అవకాశం వచ్చినా వెళ్లలేను` అని తెలిపింది.
undefined
అయితే గెస్ట్ గా వెళ్లేందుకు రెడీ అని చెప్పింది.`గెస్ట్‌గా అవకాశం వస్తే బిగ్‌బాస్‌`కి వెళ్తాను. అది కూడా డబ్బులు కోసం కాదు. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్‌ నాగార్జునని చూడ్డానికి. ఆయనతో కాసేపు హ్యాపీగా మాట్లాడి బయటకు వస్తా. నాగ్‌ హోస్టింగ్‌ చాలా బాగుంటుంది. ఇప్పటికీ స్టైలీష్‌గా, అందంగా ఉన్నారు` అంటూ నాగ్‌పై ప్రశంసలు కురిపించింది ఇంద్రజ. ఈ సందర్భంగా ఆమె నాగార్జునతో కలిసి హలో బ్రదర్‌ సినిమాలో `కన్నెపిట్టరో` పాటలో నటించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ అనుభూతి మర్చిపోలేనని తెలిపింది.
undefined
విజయవాడకి చెందిన తెలుగమ్మాయి ఇంద్రజ. అసలు పేరు రజత. చిన్నప్పటి నుంచే సింగింగ్‌, డాన్సింగ్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. వారిది కర్నాటిక్‌ మ్యూజికల్‌ ఫ్యామిలీ కావడం విశేషం. ఆ తర్వాత క్లాసికల్‌ సింగర్‌గా,డాన్సర్‌గా శిక్షణ తీసుకుంది. కుచిపూడిలోనూ ట్రైనింగ్‌ తీసుకుంది. ఆ తర్వాత జర్నలిస్ట్ గా మారాలనుకుంది. ఈ క్రమంలో ఇంద్రజ `తక దిమి తా` అనే టీవీ షోకి హోస్ట్ గానూ పనిచేసింది.
undefined
హోస్ట్ గా పేరు రావడంతో సినీ అవకాశాలు వచ్చాయి. అంతకు ముందే తాను రజనీకాంత్‌ నటించిన `ఉజైపలి` అనే సినిమాలే బాలనటిగా మెరిసింది. అలాగే `పురుష లక్షణం` అనే సినిమాలోనూ నటించింది.
undefined
నాగార్జున నటించిన `హలోబ్రదర్‌` చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసి టాలీవుడ్‌ కి ఆకట్టుకుంది. దీంతోపాటు `జంతర్‌మంతర్‌` అనే సినిమాలో ఇంద్రజగా నటించింది. దీంతో తన పేరు ఇంద్రజగా మార్చుకుంది.
undefined
అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన `యమలీల` చిత్రంతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇందులో ఆమె `నీ జీను ప్యాంట్‌ చూసి బుల్లెమ్మో..` పాట ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అందులో ఇంద్రజ డాన్సులు అంతే ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత నాగార్జున, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌ వంటి హీరోలతో అనేక సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.
undefined
మహ్మద్‌ అబ్సర్‌తో ప్రేమ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన ఇంద్రజ మళ్లీ `దిక్కులు చూడకు రామయ్య` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలకృష్ణ `లయన్‌`లోనూ మెరిసింది. `శతమానం భవతి` ఆమెకి మంచి పేరుని తెచ్చిపెట్టింది. రీఎంట్రీకి అనే దానికి సార్థకం చేసింది.
undefined
`శమంతకమణి`, `అజ్ఞాతవాసి`, `హ్యాపీ వెడ్డింగ్‌`, `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌`, `అల్లుడు అదుర్స్` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రోజా స్థానంలో `జబర్దస్త్`లో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఓ రకంగా ఈ టీవీ షోనే ఇప్పుడు ఇంద్రజకి మరింత పేరుని, గుర్తింపుని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు.
undefined
click me!