Hebah Patel : హీరోయిన్ హేబా పటేల్ లవ్ చేసే వ్యక్తి ఇతనేనా? వైరల్ గా మారిన ఫొటో

First Published | Jul 11, 2023, 1:34 PM IST

యంగ్ హీరోయిన్ హెబా పటేల్ (Hebah Patel)  సోషల్ మీడియాలో ఎఫ్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లోనే ఉంటోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
 

నార్త్ బ్యూటీ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ హేబా పటేల్ తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో తెలిసిందే. ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత నుంచి వరుసగా ఇక్కడే ఆఫర్లు సొంతం చేసుకుంది. 
 

తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది. గతంలో కాస్తా హేబాకు హిట్లు లేకపోవడంతో కాస్తా జోరు తగ్గింది. అయినా ఆయా చిత్రాలతో అలరిస్తోంది. ‘రెడ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించిన తర్వాత నుంచి హేబాకు వరుసగా ఆఫర్లు అందుతున్నాయి. 
 


చివరిగా ఈ ముద్దుగుమ్మ ఓటీటీ  వేదికన ‘ఓదేల రైల్వే స్టేషన్’; ‘వ్యవస్థ’ చిత్రాలో అలరించింది. ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్  దక్కింది. ప్రస్తుతం కూడా మరో నాలుగు చిత్రాలు రిలీజ్ కావాల్సి  ఉన్నాయి. నటిగా, స్పెషల్ అపీయరెన్స్ తోనూ ఆకట్టుకోబోతోంది. 
 

ఇదిలా ఉంటే హేబా పటేల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటుందో తెలిసిందే. ఎప్పుడూ తన గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. గ్లామర్ మెరుపులతో మంత్రముగ్ధులను చేస్తూ వస్తోంది. 
 

ఈ క్రమంలోనే ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఓ ఫొటోను షేర్ చేసినట్టు తెలుస్తోంది. ఆ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫొటోలో ఓ వ్యక్తిని హగ్ చేసుకొని కనిపిస్తోంది. వెనకాల ‘ఐ లవ్’ అని రాసి ఉండటం విశేషం. దీంతో హేబా ఆ వ్యక్తితో ప్రేమలో పడిందా? అని సందేహిస్తున్నారు. ఇక వేలా ఇలా ఓపెన్ అయ్యిందేమోనని అంటున్నారు. 

లేదంటే ఏదైనా సినిమాలోని ఫొటోనా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఫొటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. కెరీర్ విషయానికొస్తే హేబా నటించిన నాలుగు చిత్రాలు విడుదల కావాల్సి  ఉన్నాయి. తెలుగులో ‘శాసనసభ’, ‘తెలిసినవాళ్లు’; తమిళంలో ‘వల్లన్’, ‘ఆద్య’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. 
 

Latest Videos

click me!