ఎదపై పలుచటి చున్నీ.. పింక్ లిప్స్ తో మైమరిపిస్తున్న హేబా పటేల్.. కుమారి క్యూట్ సెల్ఫీలు

First Published | Apr 26, 2023, 6:39 PM IST

యంగ్ బ్యూటీ హెబా పటేల్ (Hebah Patel) ఎప్పటికప్పుడు తన గురించి అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంటూ గ్లామర్ మెరుపులతో ఆకట్టుకున్నారు. 
 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ హెబా పటేల్  గతంలో టాలీవుడ్ లో ఓస్థాయిలో సందడి చేసింది. ‘కుమారి 21ఎఫ్’తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఆకట్టుకుంది. ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో మతులు పోగొట్టింది. 

తొలిసినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకోవడంతో యంగ్ బ్యూటీకి  వరసగా ఆఫర్లు దక్కాయి. రాజ్ తరుణ్ సరసన ఎక్కువ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ పెద్దగా సక్సెస్ రేట్ ను చూడలేకపోయింది. దీంతో ఆ మధ్యలో ఆపర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. దీంతో హెబా రూటు మార్చుకుంది.
 


‘రెడ్’ మూవీలో ఏకంగా స్పెషల్ అపియరెన్స్ తో అందరినీ షాక్ కు గురిచేసింది. రామ్ పోతినేని తో గ్లామర్ స్టెప్పులు వేసి కుర్రాళ్లను ఊపూపింది. ఆ వెంటనే వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’తో డీగ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. ఇలా తనలోని డిఫరెంట్ షేడ్స్ ను  చూపిస్తూ ఆకట్టుకుంది. 

మరోవైపు సోషల్ మీడియాలోనూ హేబా పటేల్ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. అలాగే తన గ్లామర్ పిక్స్ ను కూడా షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.  

తాజాగా హేబా క్యాజువల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఓ హోటల్ లోని బెడ్ రూమ్ నుంచి సెల్ఫీ ఫొటోలను పంచుకుంది. పింక్ లిప్స్ తో ఊరిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. మరోవైపు ఎదపై పలుచటి చున్నీ కప్పుకొని కవ్వింపు చర్యలకు పాల్పడింది. తన చూపులతో, రూప సౌందర్యంతో కట్టిపడేసింది.
 

నిత్యం నెట్టింట యాక్టివ్ గా కనిపిస్తూ హెబా పటేల్  ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. నెటిజన్లు ఈ బ్యూటీ పోస్టులను లైక్స్, కామెంట్లతో క్షణాల్లోనే వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో సందడి చేస్తోంది. మరోవైపు ‘శాసనసభ’, ‘తెలిసినవాళ్లు’, ‘వల్లన్’, ‘ఆద్య’ వంటి చిత్రాల్లో ఆకట్టుకోబోతోంది. 

Latest Videos

click me!