యాపిల్ బ్యూటీ క్యూట్ ఫోజులకు ‘ఎఫ్2’ భామ ఫిదా.. గ్లామర్ మెరుపులతో మతిపోగొడుతున్న హన్సిక..

First Published | May 9, 2023, 8:09 PM IST

స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) క్యూట్ ఫొటోస్ ను షేర్ చేసుకుంది. సన్నగా మారి ఆకట్టుకున్న యాపిల్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ తో చూపు తిప్పుకోకుండా చేసింది. అందంతో అట్రాక్ట్ చేస్తోంది.
 

చైల్డ్ ఆర్టిస్ట్ గానే హన్సికా మోత్వానీ తన కేరీర్ ను ప్రారంభించింది. పదహారేళ్ల వయస్సులోనే హీరోయిన్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ తొలిచిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హన్సికను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. 
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్ గా హన్సిక మెప్పించింది. తన గ్లామర్, నటన, డాన్స్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఫలితంగా హన్సికకు తెలుగులో వరుస ఆఫర్లు అందాయి. స్టార్ హీరోల సరసన నటించి భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. 
 


తెలుగు సినిమాతోపాటు ప్రస్తుతం తమిళంలోనూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.  గతేడాది తన స్నేహితుడు, బిజినెస్ మెన్ సోహెల్ కతురియాతో పెళ్లి పీటలు ఎక్కిన ఈ ముద్దుగుమ్మ, ఇటు కేరీర్ పైనా శ్రద్ధ పెడుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది.

హన్సిక కొద్దిరోజులుగా నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న విషయం తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లలో యాపిల్ బ్యూటీ అందచందాలతో మతులు పోగొడుతోంది. కాగా తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంది. క్యూట్ లుక్స్ తో, స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో అదరగొట్టింది. 

హన్సిక పంచుకున్న తాజా ఫొటోస్ లో మినీ టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఓవైపు క్యూట్ గా నవ్వుతూ కుర్రగుండెల్ని కొల్లగొట్టింది. మరోవైపు థైష్ తో, బిగుతైన అందాలతో నెటిజన్ల హార్ట్ బీట్ పెంచేసింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

హన్సిక బ్యూటీఫుల్ ఫొటోలపై ‘ఎఫ్2’ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కూడా స్పందించింది.  యాపిల్ బ్యూటీ అందాన్ని ఫిదా అవుతూ లైక్ చేసింది. ఇక హన్సిక చేతిలో ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ వంటి చిత్రాలు ఉన్నాయి. షూటింగ్ కొనసాగుతోంది.  త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  

Latest Videos

click me!