ఇషా సెంటర్ లో సమంత.. పూర్తి ఆరోగ్యం కోసం ధ్యాన స్థితిలో సామ్.. ఇంట్రెస్టింగ్ నోట్

First Published | Jul 19, 2023, 7:44 PM IST

స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన ఆరోగ్యంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక బాటను అనుసరిస్తూ పూర్తి ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)  డివోర్స్ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. కెరీర్ పైనే ఫోకస్ పెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించారు. ప్రస్తుతం మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 
 

అయితే చైతూతో డివోర్స్ తీసుకున్నాక సమంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో అటు మెరుగైన వైద్యం తీసుకుంటూనే ఇటు ఆధ్యాత్మిక సేవలోనూ మునిగిపోతోంది. అప్పట్లో వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శించింది. ఫేమస్ టెంపుల్స్ లో ప్రత్యేక పూజలు కూడా చేసింది. 
 


ఇక మళ్లీ ఆధ్యాత్మిక బాటలోనే నడుస్తోంది. మొన్నటి వరకు వరుస సినిమాల్లో నటించింది. ‘యశోద’ రిలీజ్ సమయంలో వయోసైటిస్ వ్యాధిన పడింది. దాంన్నుంచి కోలుకోవడానికి కాస్తా సమయం పట్టింది. అయినా పూర్తిగా కోలుకోలేకపోయింది. దీంతో సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది. పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. 
 

ఈ సందర్భంగా సమయం మొత్తం తన హెల్త్ ను కాపాడుకునేందుకు, తిరిగి ఎనర్జిటిక్ గా తయారయ్యేందుకే కేటాయించింది. దీంతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా సద్గురు ఇషా సెంటర్ లో జాయిన్ అయ్యింది. 
 

కాసేపటి కింద కొన్ని ఫొటోలను పంచుకుంది. ఆహాల్లాదకరమైన వాతావరణంలో మెడిటేషన్ చేస్తూ కనిపించింది. సెంటర్ నుంచి కొన్ని ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. అలాగే ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చింది. ధ్యానంతో తనలో శక్తిని నింపుకుంటున్నట్టు తెలిపింది. 
 

నోట్ రాస్తూ.. కొద్దిసేపటి కింద ఆలోచనలు లేకుండా నిశ్చలంగా కూర్చోవడం,  ఎలాంటి కుదుపు, డిస్టబెన్స్ , కదలికలు లేకుండా ఉండటం దాదాపు అసాధ్యం అనిపించింది. ఈరోజు ధ్యాన స్థితి నాలో శక్తికి అత్యంత శక్తివంతమైన మూలంగా, ప్రశాంతతగా మారింది. ఈ ప్రక్రియ ఇంత సింపుల్‌గా ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని అనుకోలేదు. అంటూ చెప్పుకొచ్చింది. ఇక సమంత ‘ఖుషి’, ‘సిటడెల్’ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. Kushi సెప్టెంబర్ 1న విడుదల కానుంది. 

Latest Videos

click me!