కారులో ఈషా రెబ్బా క్యూట్ సెల్ఫీలు.. చీరకట్టులో తెలుగు హీరోయిన్ మెరుపులు..

First Published | Aug 27, 2023, 7:57 PM IST

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా  క్యూట్ సెల్ఫీలతో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ  చీరకట్టులో బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. 
 

తెలుగు ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా పదేళ్లకు పైగా యాక్టివ్ గా ఉంటోంది. హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇంకా చిన్నచిన్న సినిమాలకే పరిమితమైంది. అయినా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. 

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’తో మొదలైన ఈ బ్యూటీ కెరీర్ ఇప్పటికీ నార్మల్ గానే కొనసాగుతోంది. తెలుగు హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యనే ఈషా రెబ్బా కూడా ఫేస్ చేస్తోంది. ఇంతవరకు భారీ చిత్రాల్లో లీడ్ రోల్ పడకపోవడం గమనార్హం. 
 


కానీ స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తూ వస్తోంది. మీడియం బడ్జెట్ చిత్రాల్లో ఇప్పుడిప్పుడు ఈషా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఒక్క బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. వచ్చిన ఆఫర్లను సరిగ్గా వినియోగించుకుంటోంది. 
 

ఈ క్రమంలో ఈషా రెబ్బా సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా నెట్టింట వరుసగా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తోంది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

తాజాగా తెలుగు బ్యూటీ క్యూట్ సెల్ఫీలతో కట్టిపడేసింది. కారులో ఫొటోలకు ఫోజులిచ్చి మంత్రముగ్ధులను చేసింది. నేచురల్ అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేసేసింది. బ్యూటీఫుల్ స్మైల్ తో మెరిసిపోయే అందంతో ఆకర్షించింది. మరోవైపు స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో కట్టిపడేసింది.
 

ఇదిలా ఉంటే.. ఈషా రెబ్బా తన కెరీర్ పరంగా చాలా శ్రద్ధ వహిస్తోంది. ఆ మధ్యలో తెలుగులో వర్కౌట్ కాలేదని తమిళంలోనూ అడుగుపెట్టింది. మళ్లీ టాలీవుడ్ లోనే సందడి చేస్తోంది. ప్రస్తుతం సుధీర్ బాబు సరసన ‘మామ మాశ్చీంద్ర’లో నటిస్తోంది. చివరిగా ‘దయా’ అనే వెబ్ సిరీస్ లో మెరిసింది. 
 

Latest Videos

click me!