సాగరకన్యగా మారిన దివి.. ఒడ్డున పడ్డ బంగారు తీగ అంటూ కుర్రాళ్ల గోల.. వైరల్ అవుతున్న పిక్స్

First Published | Apr 25, 2023, 5:27 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ దివి (Divi) అదిరిపోయే ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు స్పెషల్ గా చేసిన ఓ ఫొటోషూట్ వైరల్ గా మారింది. 

నటి దివి పూర్తి పేరు దివ్య వాద్య. హైదరాబాద్ లో పుట్టిన పెరిగిన ఈ తెలుగు బ్యూటీ తన కేరీర్ ను మోడల్ గా ప్రారంభించింది. ప్రస్తుతం సినిమా వరుస అవకాశాలు అందుకుంటూ వస్తోంది. ఈ సందర్భంగా నెట్టింట మరింతగా సందడి చేస్తోంది.
 

తొలుత ‘లెట్స్ గో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. హీరోయిన్ గా ఆకట్టుకోలేకపోవడంతో స్టార్ హీరోల సినిమాల్లో వచ్చిన అవకాశాలను అందుకుంటూ వస్తోంది. 2019లో వచ్చిన మహేశ్ బాబు ‘మహార్షి’, గతేడాది వచ్చిన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’తో దివికి మంచి గుర్తింపు దక్కింది.


ఇదిలా ఉంటే పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 4తో దివి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.  హౌజ్ లో తనదైన శైలిలో మెదులుతూ ఎంటర్ టైన్ చేసింది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక దివికి మరింత క్రేజ్ పెరిగింది. 

మరింత క్రేజ్ దక్కించుకునేందుకు యంగ్ బ్యూటీ సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటోంది. ఎప్పటికప్పుడు వ్యక్తిగత  విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది.  మరోవైపు డిఫరెంట్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 

ఇప్పటికే సిల్క్ స్మితా మాదిరిగా చీరకట్టులో రచ్చ చేసిన విసయం తెలిసిందే. తాజాగా సాగరకన్యగా ఫొటోషూట్ చేసింది. సముద్రపు ఒడ్డున ఈముద్దుగుమ్మ ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మేమే సాహసవీరులమంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సాగరకన్యగా మెరిసిపోతున్న దివిని తమ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు.

బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేస్తూ తన పుట్టిన రోజు సందర్భంగా ఇలా స్మాల్ ట్రీట్ అందిందని దివి చెప్పుకొచ్చింది. దీంతో దివికి హ్యాపీ బర్త్ డే అంటూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దివి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ‘పుష్ప2’లోనూ కనిపించబోతుందని తెలుస్తోంది. 

Latest Videos

click me!