బాలయ్య బ్యూటీతో రామ్ చరణ్ రొమాన్స్, ఎవరా హీరోయిన్?

Published : Feb 22, 2025, 02:25 PM IST

ఈమధ్య  రామ్ చరణ్ సినిమాల్లో సీనియర్ హీరోయిన్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే రామ్ చరణ్ సరసన బాలయ్య బాబు హీరోయిన్ నటించబోతున్నట్టు తెస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ. 

PREV
15
బాలయ్య బ్యూటీతో రామ్ చరణ్ రొమాన్స్, ఎవరా హీరోయిన్?

హీరోయిన్లకు30 దాటితే చాలు.. మంచి ఫామ్ లో ఉన్న స్టార్ హీరోల సరసన తీసుకోవడం ఆపేస్తారు. ఈ ట్రెండ్ మన టాలీవుడ్ లోనే ఎక్కువగా నడుస్తుంటుంది. ఆ హీరోయిన్లను సీనియర్ హీరోయిన్ల లిస్ట్ లో వేసేస్తుంటారు. ఇక వారితో 60 ఏళ్ళు దాటిన హీరోల సరసన సినిమాలు చేసుకోవడంమే. అలాంటి వారిలో అంజలి, కాజల్, తమన్నా, సమంత, త్రిష, ప్రగ్యాజైశ్వాల్ లాంటి హీరోయిన్లు ఉన్నారు. వీరు స్టార్ సీనియర్ హీరోల జోడిలుగా నటిస్తున్నారు ప్రస్తుత. 

25

ఇక రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాలో మాత్రం అంజలి రామ్ చరణ్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించింది. చరణ్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తండ్రి పాత్ర చేసిన చరణ్ కు జోడీగా నటించింది. యంగ్ రామ్ చరణ్ కు మదర్ గా చేసింది. ఇలా ఒక రకంగా హీరోయిన్ గా కూడా నటించింది. ఇక మరోసారి రామ్ చరణ్ సరసన మరో సీనియర్ హీరోయిన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. 

35

అంతే కాదు నటసింహం నందమూరి బాలయ్య బ్యూటీతో రామ్ చరణ్ రొమాన్స్ చేయబోతున్నట్టు సమాచారం. ఇతకీ ఆ బ్యూటీ ఎవరో  కాదు ప్రగ్యా జౌస్వాల్. అవును ప్రగ్యా రామ్ చరణ్ సినిమాలో నటించబోతుందట. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. 

45

అయితే ఈసినిమాలో మరో హీరోయిన్ గా ప్రగ్యా జౌస్వాల్ ను తీసుకున్నారట టీమ్. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాని.. వార్త మాత్రం వైరల్ అవుతోంది. అంతే కాదు ఈసినిమాలో గేమ్ ఛేంజర్ మాదిరి ప్లాష్ బ్యాక్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ప్రగ్యాది ప్రముఖ పాత్ర అవుతుందట. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని టాలీవుడ్ నుంచి టాక్ గట్టిగా వినిపిస్తోంది. 

 

55
photo credit - vega sri ad

ఇక బాలయ్య బాబుతో అఖండ, డాకు మహరాజ్ సినిమాలు చేసిన ప్రగ్యా.. ముచ్చటగా మూడోసరి అఖండ 2 లో నటిస్తోంది. ఈ బ్యూటీని బాలయ్య తప్పించి.. ఇండస్ట్రీలో ఏ హీరో ఎంకరేజ్ చేయడంలేదు. బాలయ్యతోవరుసగా హిట్లు కొట్టినా కూడా టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు రావడంలేదు. మరి చరణ్ సరసన ప్రగ్యా నటించేది నిజం అయితే.. ఆమె జాతకం ఇకనైనా మారుతుందేమో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories